TEPPOTSAVAMS CONCLUDES _ వైభవంగా ముగిసిన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు

GODDESS PADMAVATHI BLESSED DEVOTEES ON GARUDA VAHANAM
TIRUPATI, 11 JUNE 2025: The annual Teppotsavams concluded on a grand religious note in Tiruchanoor on Wednesday.
Sri Padmavati Devi took out seven rounds in the holy waters of Padma Pushkarini and blessed Her devotees on the finely decked float.
 
Later the Goddess paraded along the mada streets on Garuda Vahanam.
 
Temple Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Chalapathi, other officials, temple priests, and others were present.
 
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPAT

వైభవంగా ముగిసిన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు

గరుడ వాహనంపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు

తిరుపతి, 2025 జూన్ 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు బుధవారంతో వైభవంగా ముగిశాయి. ఐదోరోజుల పాటు తెప్పోత్సవాలను నిర్వహించారు. చివరి రోజు పద్మ సరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు
తెప్పపై ఏడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 03.00 నుండి 4.30 గంటల వరకు స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది.

గరుడ వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారు:

అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.