TEPPOTSAVAMS CONCLUDES _ వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
Tirupati, 21 June 2024: The annual Teppotsavams concluded on a grand religious note in Tiruchanoor on Friday.
Sri Padmavati Devi took out seven rounds in the holy waters of Padma Pushkarini and blessed Her devotees on the finely decked float.
Later the Goddess paraded along the mada streets on Garuda Vahanam.
JEO Sri Veerabrahmam, Archaka Sri Babu Swamy, Superintendent Sri Seshagiri and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు
• గరుడ వాహనంపై అమ్మవారి దర్శనం
తిరుపతి, 2024 జూన్ 21: తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ముగిశాయి.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో తెప్పపై అమ్మవారు ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరిండెంట్
శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.