TEPPOTSAVAMS ENTER DAY 3 _ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం

TIRUPATI, 19 JUNE 2024: The annual Teppotsavams in Tiruchanoor entered the middle day on Wednesday evening.

Goddess Sri Padmavati Devi had taken a celestial ride on the finely decked Teppa to bless Her devotees.

The devotees were charmed by the divine grace of the Goddess.

Temple staff, devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం

తిరుపతి, 2024 జూన్ 19: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 గంటల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్ సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్కర్, శ్రీ గణేష్, ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.