TEPPOTSAVAMS ENTERS THE THIRD DAY _ తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం

TIRUPATI, 12 JUNE 2022: On the third day of the ongoing annual Teppotsavams in Tiruchanoor, Sri Padmavathi Devi in all Her celestial splendour charmed on the finely decked float on Sunday evening.

 

The processional deity took three rounds on the float in Padma Pushkarini to bless Her devotees.

 

Temple DyEO Sri Lokanatham, EE Sri Narasimha Murty and others, devotees were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం
 
తిరుపతి, 2022 జూన్‌ 12: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం శ్రీ పద్మావతి అమ్మవారు   తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
 
సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు  ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో చివరి రెండు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, ఇఇ శ్రీ నరసింహ మూర్తి, డెప్యూటీ ఇఇ శ్రీ సురేష్ బాబు, ఏఇ శ్రీ సురేష్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఏఇ శ్రీ మురళీకృష్ణ, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దామోదరం, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.