THOUSANDS OF PILGRIMS WITNESS SRINIVASA KALYANAM IN DEHRADUN _ డెహ్రాడూన్‌లో కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం
Dehradun, 03 June 2013: It has been a colourful feast to many thousands of pairs of eyes who witnessed the grandeur of celestial wedding of Lord Malayappa Swamy (Lord Venkateswara or Lord Balaji) along with His two consorts in Dehradun(Uttarakhand) on Sunday.
The Srinivasa Kalyanam has been performed by Tirumala Tirupati Devasthanams (TTD) with spiritual splendor and religious ecstasy in Dehradun in the premises of Lord Venkateswara Kalyana Mandapam, Subhash Road opp Secretariat. The celestial fete was performed by a team of priests hailing from TTD.
Addressing the ceremonious occasion, TTD Trust Board Chairman Sri K Bapiraju, said, TTD has been conducting Srinivasa Kalyanams with an aim to propagate Sri Venkateswara Bhakti cult across the globe. “TTD will offer its support to construct amenities complex, information centres here also if we are given some land ”, he said.
JEO Sri KS Sreenivasa Raju said, TTD has been doing several socio-religious activities apart from providing darshan and accommodation facilities to the multitude of visiting pilgrims.
Meanwhile a team of archakas who perform pujas and Kalyanotsavam in the Srivari temple in Tirumala led by Agama scholar Sri Sunderavadanacharya and Bokkasam Clert Sri Gururaja Rao conducted the celestial marriage with utmost devotion and spiritual elegance with different aspects of puja starting with Vishwaksena Aradhana, followed by Punyahavachanam, Ankurarpana, Kanakana Dharana, Agni Pratistha, Mahajana Sankalpam, Kanyadanam, Mangalya Dharana Mahotsavam ceremony, Nakshatra Harati and concluding with Kumbha Harati.
The artistes of TTD’s Annamacharya Project enthralled the local denizens by rendering Keertans penned by Saint Poet Annamacharaya during the performance of Srinivasa Kalyanams. The various venue of Lord’s Kalyanams echoed with Govinda Namas of devotees who thronged the grounds to see majesty of Lord in the guise of Bride Groom and sanctified their lives.
Dist Collector Dr. BVRC Purushotham IAS, Dr. Swarna Subba Rao, Surveyor General of India, Dr. YVN Krishna Murthy, Director IIRs, local officers, denizens also took part in this celestial marriage.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER TTDs TIRUPATI
డెహ్రాడూన్‌లో కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం
తిరుపతి, జూన్ 03, 2013: ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్తరాదిలోని ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని నగరమైన డెహ్రాడూన్‌లో ఆదివారం సాయంత్రం శ్రీనివాస కల్యాణం అట్టహాసంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ దైవిక వివాహ వైభవాన్ని చూసి భక్తి పారవశ్యంతో పులకించారు.
డెహ్రాడూన్‌లోని సెక్రటేరియట్ ఎదురుగా సుభాష్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. పుణ్యాహవచనంతో ప్రారంభమైన ఈ కల్యాణ మహోత్సవం సుమారు రెండు గంటల పాటు కొనసాగి మంగళ హారతితో వేడుకగా ముగిసింది. తితిదే అర్చక బృందం నేతృత్వంలో శ్రీవారి ఉత్సవరులైన శ్రీమలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవిలకు అత్యంత రమణీయంగా దివ్యమంత్రోచ్ఛారణ మధ్య వివాహమహోత్సవం జరిగింది. హైందవ సాంప్రదాయ వివాహ విధానాన్ని అనుసరించి జరిగిన ఈ కల్యాణ మహోత్సవంలో పుణ్యాహవచనం అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, రక్షాబంధన, అగ్ని ప్రతిష్ట, వస్త్రసమర్పణ, మహాసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, ఎదురుకోళ్లు, నక్షత్ర హారతి మొదలైన సాంప్రదాయ విధానాలను నిర్వహించి చివరగా మంగళహారతి నివేదనతో కల్యాణమహోత్సవాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు.
ఈ సందర్భంగా తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గౌ|| విజయ్ బహుగుణ కోరిక మేరకు డెహ్రాడూన్‌లో తితిదే సమాచార కేంద్రం, అతిథిగృహం నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే స్థలం కేటాయించాలని కోరారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపచేయడమే లక్ష్యంగా తితిదే ఈ శ్రీనివాస కల్యాణాలను గత ఏడేళ్లుగా వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాలలో మాత్రమే కాకుండా విదేశాలలో సైతం నిర్వహిస్తోందన్నారు. ఎక్కడ ఈ కల్యాణాలు నిర్వహిస్తే అక్కడ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని తమకు ఆ ప్రాంత ప్రజలు ఆనందోత్సాహాలతో తెలుపుతున్నట్టు చెప్పారు.
అనంతరం తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ప్రఖ్యాత ధార్మిక క్షేత్రంగా వెలుగొందుతోందన్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బస, ఇతర వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సనాతన ధర్మవ్యాప్తి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలే గాక సామాజిక, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. శ్రీనివాస కల్యాణాలతో తితిదే హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని పెంచుతోందని, ఆధ్యాత్మిక విలువలను కూడా ప్రచారం చేస్తోందని చెప్పారు. ఆయా ప్రాంతాల భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని తితిదే ఈ కల్యాణాల ద్వారా కల్పిస్తోందన్నారు. దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ చక్కటి అవకాశాన్ని తితిదే కల్పించిందన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.