Three Day Annual Abhideyaka Abhishekam begins _ శ్రీవారి ఆలయంలో అభిదేయక అభిషేకం (జ్యేష్టాభిషేకం)

The three-day annual `Abhideyaka abhishekam’ began at the Hill temple of Lord Venkateswara on Monday.
 
As part of the festival, the usual `kavachams ‘ which are adorned to the sacred idols to protect them are removed once in a year during the festival and the celestial `abhishekam’ is performed at Sampangi Prakaram inside Sri Vari Temple, Tirumala. The rare diamond-studded armour (Vajra Kavacham) will be adorned to the Processional Deity of Lord Malayappaswamy and His consorts on the first day. The deity will be taken in a procession around the temple on all three days. Five persons can take part in the ceremony on payment of Rs.2000.
 
Sri K.S.Srinivasa Raju, TTD Joint Executive Officer, C.V&S.O Sri M.K.Singh, Temple DyE.O Sri Munirathnam Reddy, Temple Peiskhars Sri Chandrasekhar Pillai, Sri Rama Murthy Reddy and devotees took part.

శ్రీవారి ఆలయంలో అభిదేయక అభిషేకం (జ్యేష్టాభిషేకం)

తిరుమల, జూన్‌ 13, 2011: జూన్‌ 13 నుండి 15 వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అభిదేయక అభిషేకం (జ్యేష్టాభిషేకం) ఈ రోజు ఉదయం 9 గంటలకు వేడుకగా ప్రారంభమైనది. శ్రీదేవి భూదేవి ఉభయ నాంచారులతో కూడియున్న శ్రీ మలయప్పస్వామివారు ఆనంద నిలయాన్ని విడిచి సంపంగి ప్రాకారంలో ఉన్న కల్యాణ మండపంలోకి వేంచేశారు.

 
ముందుగా రుత్విక్కులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, పిదప నవకలశ ప్రతిష్ఠ అవాహన చేసి పూజా నివేదన హారతులు చేశారు. తర్వాత కంకణ ప్రతిష్ఠ చేశారు.
పిదప శ్రీదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి అర్ఘ్యపాద్యాచమనాది క్రియలు నిర్వర్తించి, కంకణధారణ చేశారు. ఆ పిదప శాంతి హోమాదులు పూర్తి అయిన తర్వాత స్వామివారికి దేవేరికి హోమతిలకం ధరింపజేశారు. ఆ తర్వాత స్నపన తిరుమంజనం ప్రారంభమయినది.
 
అభిషేకం (స్నపన తిరుమంజనం)
 
ముందుగా బంగారు శంఖాలతో జియ్యంగార్‌ శుద్దజలాలను అందిస్తుండగా అర్చకస్వామి పురుషషసూక్తాన్ని ప్రారంభిస్తూ ఆ జలంతో శ్రీస్వామివారికి అభిషేకం చేసారు. వేదపండితులు పురుషసూక్తంతో పాటు శ్రీసూక్తం, భూసూక్తం ఇత్యాది పంచసూక్తాలను పఠిస్తుండగా అభిషేకం కొనసాగుతూ వచ్చింది.
శుద్ధజలంతో అయిన తర్వాత పాలతో అభిషేకం జరిగినది. పాలతో అభిషేకం పూర్తి అయిన తరువాత శత కలశాలలోని కొన్నింటితో అభిషేకం చేశారు. ఆ తర్వాత పెరుగుతో అభిషేకం చేసారు. పెరుగుతో అభిషేకం పూర్తి అయిన వెంటనే శతకలశాలలోని మరికొన్ని కలశాలతో అభిషేకించారు.  
 
ఇలా వరుసగా, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు అభిషేకం చేసారు. చివరగా చందనాన్ని శ్రీ స్వామివారికి అమ్మవారలకు శిరసాదిగా బాగా అలది తిలకధారణ చేసి, తులసమాలల్ని అలంకరించారు. ఆ తర్వాత నవకలశాలలోని జలంతో బంగారు తట్టలోని సహస్రధారలతో సహస్రధారాభిషేకం పూర్తి చేసారు. ఈ అభిషేక జలాన్ని ముందుగా అర్చకస్వామి తన శిరస్సుపై చల్లుకొని, ఆ తర్వాత భక్తులందరిపైనా పూతో భవ అని ప్రోక్షించారు.
ఆ తర్వాత ఉత్సవమూర్తులకు వస్త్రాలంకారంచేసి, నివేదన చేసారు. పిదప శ్రీస్వామివారు, దేవేరులతో కూడి నిత్యకల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం వగైరా ఉత్సవాలకు సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మలయప్పస్వామి వారికి వజ్రకవచాన్ని ధరింపచేసి విశేష ఆభరణాదులతో పూలమాలలతో అలంకరించి తిరుమల పుర వీధుల్లో ఊరేగారు.
 
ఈ ఉత్సవంలో తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ముఖ్యభద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్‌, ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ మునిరత్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.