THREE PURANAM BOOKS UINVEILED AT GAJA VAHANA _ గజ వాహన సేవలో మూడు పురాణాలు ఆవిష్కరణ

Tirupati,14 November 2023: Three Puranam books published by TTD were released by TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy during the Gaja Vahana Seva during the ongoing annual Brahmotsavam at Sri Padmavati temple in Tiruchanoor on Tuesday night.

TTD has already published five  Purana volumes as part of its commitment to Sanatana Dharma by establishing the Purana Itihasa Project.

The Purana volumes released were Markandeya Maha Puranam by Acharya Sripada Subramanyam, Linga Maha Puranam by Dr Babavali Rao and Vamana Maha  Puranam by Dr Prabhakar Krishnamurthy.

JEOs (H & E) Smt Sada Bhargavi,t) Sri Veerabrahmam, Temple DyEO  Sri Govindarajan, Publication Wing Special Officer Sri Dr Akella Vibhishana Sharma were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

గజ వాహన సేవలో మూడు పురాణాలు ఆవిష్కరణ

తిరుపతి, 2023 నవంబరు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజైన మంగళవారం రాత్రి జరిగిన గజ వాహన సేవలో మూడు పురాణాలను టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆవిష్కరించారు.

సనాతన హైందవ ధర్మానికి మూలాలైన అష్టాదశ మహా పురాణాలను అర్ధ తాత్పర్యాలతో భక్తులకు అందించడానికి టీటీడి పురాణ ఇతిహాస ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఐదు పురాణాలను టీటీడీ భక్తులకు అందించింది.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం అనువదించిన మార్కండేయ మహా పురాణం, డాక్టర్ బాబావలి రావు అనువదించిన లింగ మహా పురాణం, డాక్టర్ ప్రభాకర కృష్ణమూర్తి అనువదించిన వామన మహా పురాణాలను ఆవిష్కరించింది.

మార్కండేయ మహాపురాణం:

తీర్థయాత్రల వల్ల ప్రయోజనాలు, సత్య హరిశ్చంద్రుని సత్య దీక్ష, మానవుల కోర్కెలను అన్నింటిని తీర్చే దుర్గాదేవి ఉపాసన తదితర అంశాలు వివరించబడింది.

లింగ మహాపురాణం :

శివలింగ ఆరాధన, శివ భక్తి, కాశీ క్షేత్ర వైభవం, పార్వతీ కళ్యాణం తదితర అంశాలు వివరించబడ్డాయి.

వామన మహా పురాణం –

శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఒకటి వామనావతారం.

గజేంద్రమోక్షం, సరస్వతీ దేవి మహిమ, పుష్కరాల మహిమ, వంటి గొప్ప విశేషాలు ఇందులో వివరించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీయానాదయ్య, శ్రీ నాగసత్యం, శ్రీ సుధీర్ కుమార్, శ్రీ తిప్పేస్వామి, శ్రీ శేషుబాబు, శ్రీ ఆర్ వి దేశ్ పాండే, శ్రీ సుబ్బరాజు, శ్రీ ఉదయ బాను, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, అనువాద రచయితలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.