TIME SLOT TOKENS IN TIRUPATI FOR JAN 4 _ జనవరి 4వ తేదీన శ్రీవారి దర్శనానికై తిరుపతిలో శనివారం అర్థరాత్రి నుండి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ
Tirupati, 2 Jan. 21: The time slot tokens (free darshan) will be issued by TTD in Tirupati today midnight (January 2 midnight) at the counters in Vishnu Nivasam, Bhudevi complex for darshan on January 4.
The devotees are requested to make note of this and come to counters wearing masks, carrying sanitisers and maintaining social distance.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 4వ తేదీన శ్రీవారి దర్శనానికై తిరుపతిలో శనివారం అర్థరాత్రి నుండి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ
తిరుమల, 2021 జనవరి 02 : తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో జనవరి 4వ తేదీన స్వామివారి దర్శనం కొరకు సర్వదర్శనం టైంస్లాట్ ( ఉచిత దర్శనం) టోకెన్లు శనివారం ( నేడు) అర్థరాత్రి 12 గంటల నుండి జారీ చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు జనవరి 3వ తేదీ వరకు సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను ఇప్పటికే జారీ చేసిన విషయం తెలిసిందే.
టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని టిటిడి సూచించింది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.