TIRUCHANOOR ALL SET FOR KARTHEEKA BRAHMOTSAVAMS _ పూర్తికావస్తున్న అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

TIRUPATI, NOVEMBER 29:  The temple town of Tiruchanoor is decked up to celebrate the annual mega-religious fete of Kartheeka Brahmotsavams of
Goddess Sri Padmavathi which is all set to commence from December 2.
 

The temple administration of Tirumala Tirupati Devasthanams(TTD) has
made elaborate arrangements for the annual festival. The pilgrim town
donned a festive look with colourful rangolis giving a splendid look all along the mada streets. The Tholappa Gardens have been decorated with various varieties of flowers and pandals have been erected to give a celestial look. A stage has been set ready to distribute prasadams to thousands of visiting pilgrims on this occasion.
 

The celestial fete will commence with Laksha kumkumarchana on the morning of December 1 and the Ankurarpanam ritual will be performed on
the same day evening. The nine-day festival which will commence on Thursday morning between 9:40am to 10:00am in Makara Lagnam with the
hoisting of “Gaja Patham” (celestial flag with the image of elephant) on the temple pillar marking the successful beginning of the mega event. The other important days include, Gaja Vahanam, procession of the processional deity of Goddess Padmavathi on Her favourite divine elephant vehicle on December 6 evening the fifth day of Brahmotsavams, followed by Swarna Ratham on December 7 evening at 4:35pm, Rathotsavam at 7:15am on December 9 and the festival concludes with the famous Panchami Teertham on December 10 at 12noon. On December 11, Pushpayagam will be performed to Goddess Padmavathi.

 TTD has organised special cultural programmes for the occasion. The
HDPP, Annamacharya Project, SV Music and Dance college artistes will perform traditional and spiritual cultural arts in Aasthana Mandapam to entertain and enthrall the visiting pilgrims.
 

Apart from this TTD has also set up first aid centres and health centres for the sake of the pilgrims near Tholappa Gardens. The doctors from BIRRD, SVIMS, SV Ayurvedic hospital and TTD central hospital will render medical services to the needy. The TTD health department has taken all measures to keep the temple premises clean and hygenic.
 

Temple Deputy EO Sri Munirathnam Reddy, Superintending Engineer Sri
Ramachandra Reddy, Deputy EE, Sri Jyothaiah inspected the arrangments.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER OF TTD, TIRUPATI 

 

పూర్తికావస్తున్న అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

 తిరుపతి, 2010 నవంబర్‌-29: తిరుచానూరులో డిశెంబర్‌ 2వ తేది నుండి 10వ తేది వరకు నిర్వహించనున్న  శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.

అమ్మవారి ఆలయం ముందు అమ్మవారి వాహన మండపం పనులు శరవేగంతో జరుగుచున్నాయి. అదేవిధంగా మాడవీధులలోను, అమ్మవారి పుష్కరిణి, ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తోళ్ళప్పగార్డెన్స్‌లో వేలాదిమందికి ప్రసాద వితరణ చేసేందుకు అవసరమైన పందిళ్ళు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పుస్తక విక్రయశాల, దర్శన టిక్కెట్‌ కౌంటర్లకు గాను ఆలయం ముందు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

డిశెంబరు 1న ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పాణ కార్యక్రమాలు జరుగనున్నాయి.  ఇక అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు డిశెంబరు 2, గురువారం ఉదయం మకర లగ్నంలో 9.40 ని. నుండి 10.00 ని. నడుమ గజపట ధ్వజారోహణంతో ప్రారంభమౌతాయి. ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన డిశెంబరు 6 సాయంత్రం 8.30 గంటలకు గజవాహనం, డిశెంబరు 7న సాయంత్రం 4.35 గంటలకు స్వర్ణరథం, డిశెంబరు 9నాడు ఉదయం 7.15 నిముషాలకు రథోత్సవం, డిశెంబరు 10 మధ్యాహ్నం 12 గంటలకు కుంభ లగ్నంలో నిర్వహించే పంచమీతీర్థంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. ఇక డిశెంబరు 11న అమ్మవారికి పుష్పయాగం కూడా నిర్వహిస్తారన్నారు.

బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు విచ్చేసే వేలాది మంది భక్తుల మనోఉల్లాసానికై తితిదేకి చెందిన శ్రీవేంకటేశ్వర సంగీత కళాశాల ఆధ్వర్యంలోను, అన్నమాచార్య ప్రాజెక్టు, ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో పలు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్థానమండపం నందు నిర్వహించనున్నారు. అదేవిధంగా భక్తులకు ఆరోగ్యపరమైన అవసరాలను దృష్ఠిలో వుంచుకొని తోళ్ళప్పగార్డెన్స్‌లోను, సన్నిధి వీధినందు, శ్రీ పద్మావతి సత్రం వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రాలలో స్విమ్స్‌, బర్డ్‌, ఆయుర్వేద ఆసుపత్రి, తితిదే సెంట్రల్‌ హాస్పిటల్‌ నుండి వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది తమ సేవలను భక్తులకు అందించనున్నారు. తోళ్ళప్పగార్డెన్స్‌ మాడవీధులు, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా వుంచేందుకుగాను ఆరోగ్యశాఖ మరింత మరది సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నది.

ఈ ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ మునిరత్నంరెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌
శ్రీరామచంద్రారెడ్డి, డిప్యూటీ ఇఇ శ్రీ టి.జ్యోతయ్య తదితరులు పరిశీలించారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.