TIRUCHANOOR PANCHAMI THEERTHAM SARE FROM TIRUMALA _ శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

Tirumala, 19 Nov. 20: As a traditional practice, the Sare-precious presentation from Tirumala reached Tiruchanoor in a formal procession in four mada streets on Thursday.

The presentation from Swamivaru to His Consort Sri Padmavathi Ammavaru at Tiruchanoor comprised of trumeric, vermilion, silks, ornament to be decorated to Goddess on this special occasion.

Both the Jiyar Swamis of Tirumala, Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath, VSO Sri Manohar, Peishkar Sri Jagan Mohanacharya were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

తిరుమల‌, 2020 నవంబరు 19: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందుకోసం ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి 4.30 గంటల వరకు పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత గర్భాలయంలో శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేప‌ట్టారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించిన‌ అనంతరం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి తీసుకెళ్లారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ జగన్ మోహనాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.