TIRUCHANOOR TEMPLE VIRTUAL KALYANAM PORTAL RELEASED _ భక్తులకు అందుబాటులో శ్రీ పద్మావతి అమ్మవారి వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లు
Tiruchanoor 09, February 2021: TTD on Tuesday launched virtual Kalyanotsavam tickets of Goddess Sri Padmavati ammavari temple at Tiruchanoor in its online portal.
It is well known that in view of Covid-19 guidelines TTD has been organising Kalyanotsavam in Ekantham at Sri Padmavati temple at Tiruchanoor.
Upon the request of devotees, TTD commenced Virtual Kalyanam in the Srivari temple at Tirumala which received an overwhelming response from devotees.
On the same lines TTD commenced virtual Kalyanam in Padmavati temple also.
The online tickets are available five days in a week from Monday-Friday and priced at ₹500 each on which two devotees will be permitted.
The Grihastas would witness the virtual seva in SVBC live telecasts between 10 a.m. and 11 a.m every day.
Thereafter within 90 days the Grihastas could come to Tiruchanoor and avail darshan on presenting their online ticket and also beget one uttarium, one blouse, Akshintalu and Prasadam.
Devotees could book their tickets for virtual Kalyanotsavam in TTD portal- https://tirupatibalaji.ap.gov.in
భక్తులకు అందుబాటులో శ్రీ పద్మావతి అమ్మవారి వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లు
తిరుపతి, 2021 ఫిబ్రవరి 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆన్‌లైన్ వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లను మంగళవారం నుండి టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. భక్తుల కోరిక మేరకు తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో ఇక్కడ ఆన్‌లైన్ విధానంలో కల్యాణోత్సవం నిర్వహిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఆలయాల్లో ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు కల్యాణోత్సవం టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ధర రూ.500/-గా నిర్ణయించారు. గృహస్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు. ఆ తరువాత 90 రోజుల్లోపు గృహస్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించారు. దర్శనానంతరం ఉత్తరీయం, రవిక, అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు.
https://tirupatibalaji.ap.gov.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.