TIRUCHI SEVA HELD _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి

TIRUPATI, 12 FEBRUARY 2026: On the fifth day on Wednesday as part of ongoing annual brahmotsavams at Sri Kapileswara Swamy temple Sri Somaskanda Murty along with Kamakshi Devi atop Tiruchi blessed devotees all along the streets surrounding the temple.

TTD officials and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

తిరుపతి, 12 ఫిబ్రవరి 2026: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై  అనుగ్రహించారు. 

భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం.

అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

వాహన సేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.