TIRUMALA REVERBERATES TO VISHNU SAHASRANAMA PARAYANAM _ తిరుమల విష్ణు సహస్రనామ పారాయణానికి పులకించిన సప్తగిరులు
72-HR PARAYANAM BY CGVSS
BLIND CHILDREN STEALS THE SHOW
Tirumala, 02 May 2022: The Chennai Group of Sri Vishnu Sahasranama Satsang(CGVSS) is organising a three-day Vishnu Sahasranama Parayanam which commenced in Tirumala on Monday under the auspices of HDPP wing of TTD.
TTD Additional EO Sri AV Dharma Reddy participated in the inaugural session of the program at Asthana Mandapam in Tirumala where in nearly blind students (Hyderabad based Devanar School) Sahasranamam that stood as a major attraction of the spiritual event.
Speaking on the occasion Sri AV Dharma Reddy highlighted the importance of Vishnu Sahasranama Parayanam. He said TTD has been organising various parayanams for the well-being of humanity across the globe since last two years.
Earlier in his Anugraha Bhashanam Sri Pedda Jeeyar Swamy of Tirumala complimented VISVAS Organization for spreading its wings in across 36 nations and performing Akhanda Vishnu Sahasranama Yagnam with 40 thousand devotees.
LAC President Sri Sekhar Reddy, VISVAS Global Team Founder Sri Sreedharan and a large number of devotees were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
తిరుమల విష్ణు సహస్రనామ పారాయణానికి పులకించిన సప్తగిరులు
– ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంధవిద్యార్థుల విష్ణు సహస్ర నామ పారాయణం
తిరుమల, 2022 మే 02: చెన్నైకి చెందిన శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగం బృందం విష్ణు సహస్రనామ పారాయణంతో సప్తగిరులు పులకించాయి. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరిగే విష్ణు సహస్రనామ పారాయణం సోమవారం నాడు ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వున్న మానవాళి శ్రేయస్సు కోసం టీటీడీ గత రెండేళ్ల నుంచి పలు పారాయణాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విష్ణు సహస్రనామ పారాయణం ప్రాముఖ్యతను వివరించారు.
అంతకుముందు తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ 36 దేశాలలో 40 వేల మంది భక్తులతో ఈ అఖండ విష్ణు సహస్రనామ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నందుకు విశ్వస్ ఆర్గనైజేషన్‌ను అభినందించారు.
హైదరాబాద్ దేవనార్ స్కూల్‌కు చెందిన 50 మంది అంధ విద్యార్థులతో నిర్వహించిన శ్రీ విష్ణు సహస్రనామ ఆధ్యాత్మిక పారాయణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో చెన్నై సలహామండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, విశ్వాస్ గ్లోబల్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీధరన్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.