TIRUMALA SHOULD BE DECLARED A NO FLYING ZONE _ తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి కేంద్ర విమానయాన శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ లేఖ
Tirumala, 01 March 2025: TTD Chairman Sri BR Naidu has written to Union Aviation Minister Sri Kinjarapu Rammohan Naidu seeking his intervention to declare no flying zone over Tirumala shrine.
The letter stated that Tirumala should be declared a no-flying zone keeping in mind the principles of Agama Shastra, sanctity of the temple, safety and sentiments of the devotees.
It has also stated that low-flying planes, helicopters and other aerial activities on the Tirumala hill are disturbing the sacred atmosphere around the Srivari temple.
To protect the sanctity, cultural and spiritual heritage of Tirumala, in the letter, the TTD Chairman has sought the Union Minister to respond in this matter and take appropriate action.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి కేంద్ర విమానయాన శాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ లేఖ
తిరుమల, 2025 మార్చి 01: తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు లేఖ రాశారు.
ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబుధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.
తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు.
తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గంగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు.
తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.