TIRUMALA TEMPLE DOORS CLOSED AT 3:30PM FOLLOWING LUNAR ECLIPSE _ తిరుమలలో చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత
TO REOPEN ON SEPTEMBER 08 AT 3AM AFTER SUDDHI – TTD CHAIRMAN
ALL DEVOTEEES PROVIDED DARSHAN AS PER SCHEDULE – ADDITIONAL EO
TTD DISTRIBUTES ANNAPRASADAM PACKETS
Tirumala, 07 September 2025: In the wake of the Lunar Eclipse on Sunday from 9:50 pm till 1:31 am on Monday, the temple doors of Sri Venkateswara Swamy in Tirumala were closed in a traditional manner at 3:30pm on September 07.
Speaking to the media outside the main temple, the TTD Trust Board Chairman Sri BR Naidu said following the Lunar Eclipse on Sunday, the temple doors were closed in a ceremonious manner and will be reopened on Monday after the Suddhi and other religious rituals at 3pm.
The Additional EO Sri Venkaiah Chowdary said all the devotees who were in the compartments were provided darshan as per the time schedule without any inconvenience.
The Annaprasadam wing of TTD has also prepared 50thousand Pulihora packets to be distributed among devotees today, as even the main Annaprasadam Complex, Vakulamata, PAC 2 and Vaikuntham Canteens also remains closed in Tirumala owing to the Lunar Eclipse. The Annaprasadam activity commences from 8am onwards on Monday, he maintained.
The Chief Priests of Tirumala temple, Temple DyEO Sri Lokanatham, Annaprasadam DyEO Sri Rajendra, VGO Sri Surendra and others were present.
తిరుమలలో చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత
• సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల తర్వాత భక్తులకు దర్శనం
తిరుమల 2025 సెప్టెంబరు 07: చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను టీటీడీ మూసి వేసింది.
సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్లు టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు మీడియాతో మాట్లాడుతూ, చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు సంప్రదాయబద్ధంగా మూసివేసి, సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా శుద్ధి తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన ఉదయం 3 గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
అదనపు ఈఓ శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు దర్శనం కల్పించడం జరిగింది అని తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాదం కాంప్లెక్స్, వకుళమాత, పిఏసి–2, వైకుంఠం వంటశాలలు మూసి వేసినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద విభాగం భక్తుల కొరకు 50 వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసిందన్నారు.
అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుండి పునః ప్రారంభమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ అర్చకులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అన్నప్రసాదండిప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్ర, విజిఓ శ్రీ సురేంద్ర, ఇతరులు పాల్గొన్నారు.






