TIRUMANJANAM AND CHAKRASNANAM HELD AT MAHA KUMBH MELA _ మహా కుంభ మేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం
Tirumala, 16 January 2025: TTD grandly organized the Snapana Tirumanjanam program on Thursday at Dashaswamedha Ghat in Prayagraj in Maha Kumbha Mela.
A team of priests led by Sri Venugopala Deekshitulu, one of the chief priests of Tirumala temple, organized the Tirumanjanam ceremony of Sri Srinivasa Swamy along with Sridevi and Bhudevi on the banks of the holy Ganga river.
Snapana Tirumanjanam was performed with milk, curd, honey, coconut water, turmeric and sandalwood paste. The devotees witnessed the entire fete with religious ecstasy.
On this occasion, Vedic scholars recited Pancha Suktams including Sri Suktam, Bhusuktam, Nila Suktam, Purusha Suktam and Narayana Suktam.
After abhishekam, the idols were decorated with Tulsi garlands.
Subsequently, the anthropomorphic form of Lord, Sri Sudarshana Chakrattalwar was carried into the river Ganga amidst the playing of Mangala Vaidyams and chanting of Vedic mantras.
There, the special puja and Harti were offered to Sri Chakratalwar and Chakrasana Mahotsavam was held.
In this program, HDPP Secretary Sri Sriram Raghunath, DyEO Sri Guna Bhushan Reddy, Superintendent Sri Guru Rajaswamy and other officers participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మహా కుంభ మేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం
తిరుమల, 2025 జనవరి 16: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని పవిత్ర గంగా నది ఒడ్డున కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన స్నపన తిరుమంజనం స్థానిక భక్తులను భక్తి పారవశ్యానికి లోను చేసింది.
ఈ సందర్భంగా వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, మొదలైన పంచ సూక్తాలను అర్చకులు వల్లించారు.
అభిషేకానంతరం తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తదనంతరం శ్రీ చక్రతాళ్వార్ ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీ చక్రతాళ్వార్ కు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ గురు రాజస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.