TIRUPATI ART LOVERS ENJOYS CULTURAL FEAST _ వీక్షకులను అలరించిన సంగీత నృత్య ప్రదర్శన
వీక్షకులను అలరించిన సంగీత నృత్య ప్రదర్శన
తిరుమల, 2024 అక్టోబరు 10 ; శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏడో రోజు గురువారం మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల లెక్చరర్ శ్రీ సి.హరినాథ్ బృందం తమ భరతనాట్య ప్రదర్శనతో సభను సమ్మోహితులను చేశారు. 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ వై.శ్రీనివాసులు బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
అన్నమాచార్య కళా మందిరంలో 6.30 నుండి 7.30 గంటల వరకు ముంబాయికి చెందిన శ్రీమతి వరలక్ష్మీ భక్తి సంగీత కార్యక్రమం భక్తులను అలరించింది. 7.30 నుండి 8.30 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీమతి జయప్రద రామ్మూర్తి వీణతో భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ రామచంద్ర పుష్కరణి వేదికలో శ్రీయం.మురళీకృష్ణ బృందం వారి భక్తిసంగీత కార్యక్రమం 6.30 నుండి 8:30 వరకు జరిగింది. వీరి బృందంచే ఆలపించిన కీర్తనలు భక్తాదులను అలరించాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.