TIRUPATI CITIZENS TASTE THE CULTURAL FEAST OF NAVARATRI BRAHMOTSAVAMS _బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు _ మహతిలో ఆకట్టుకున్న “శ్రీనివాసకల్యాణం” నృత్యప్రదర్శన
Tirumala, 19 October 2023: On the 5th day of the ongoing Navaratri Brahmotsavam, the denizens of Tirupati were enthralled by a cultural feast of dance ballets and Sankeertans at several auditoriums of temple city on Thursday.
At the Mahati auditorium, the 32 members of Ms. Jayalakshmi Jitendra’s troupe of Bengaluru enthralled the audience with a dance performance of “Srinivasakalyanam” on behalf of the Kailasakaladhar Cultural and Charitable Trust
While at the Ramachandra Pushkarini venue, a concert by Sri Venkateswara Sangeet Nritya College, Sirisha Chandana Band held the audience spellbound and a dance performance by Kirtana Tejaswi troupe engrossed the devotees and audience.
At the Annamacharya Kalamandiram Chetana and Likija from Aravinda Arts Academy entertained with their spectacular performance.
The HDPP Secretary Acharya Srinivasulu, other officials, and devotees were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
– మహతిలో ఆకట్టుకున్న “శ్రీనివాసకల్యాణం” నృత్యప్రదర్శన
తిరుమల, 2023 అక్టోబరు 19 ; శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో బెంగళూరుకు చెందిన శ్రీమతి జయలక్ష్మి జితేంద్ర వారి కైలాసకళాధర్ కల్చరల్ మరియు చారిటబుల్ ట్రస్టు తరపున 33 మందితో కూడిన బృందంతో చేపట్టిన “శ్రీనివాసకల్యాణం ” నృత్యప్రదర్శన సభను అబ్బురపరచింది.
ఈ నృత్యప్రదర్శన ప్రారంభం గణేశప్రార్థన అనంతరం లక్ష్మీదేవి స్తుతి, గోవిందనామోచ్ఛారణ, నారదుని ప్రవేశం, పద్మావతి పూర్వ జన్మలో సీత-వేదవతి అని చెప్పడం, సప్తగిరులను పేర్కొనడం, వాటికి ఏవిధంగా పేరు వచ్చిందో తెలపడం, తిరుమలగిరుల మాహాత్మ్యంతో శ్రీనివాస కల్యాణ ప్రదర్శన రమ్యంగా జరిగింది.
రామచంద్రపుష్కరిణి వేదికలో మొదట శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల శిరీష చందన బృందం సంగీత కచేరి, తర్వాత కీర్తన తేజస్వీ బృందం సమర్పించిన నృత్యం భక్తిరసవాహినిలో ముంచెత్తింది.
స్థానిక అన్నమాచార్య కళామందిరంలో అరవింద ఆర్ట్స్ అకాడమీకి చెందిన చేతన, లికిజ చిన్నారులతో మహాగణపతింభజే అనే కీర్తన నాటరాగం ఆదితాళంతో నృత్యం ప్రారంభించి, అంబాపరాకు ఇత్యాది కీర్తనకు కుమారి భవ్య నృత్యాభినయం చేసి సభను అలరించింది.
అదేవిధంగా, తిరుమలలోని ఆస్థాన మండపంలో విష్ణుసహస్రనామ పారాయణం, ధార్మికోపన్యాసాలు, అన్నమయ్య సంకీర్తనల ఆలాపన ఆకట్టుకున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.