TIRUPATI DENIZENS IMMERSED IN DEVOTIONAL WAVES _ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

TIRUPATI, 20 OCTOBER 2023: The denizens of the temple city are immersed in the bhakti waves while witnessing the variety of art forms on various platforms conducted by TTD in connection with the ongoing Navaratri Brahmotsavam.

 On the sixth day evening on Friday, the dance ballets on Tillana, Ganesha Pancharatnam, and Dasavatara Vaibhavam mesmerized the locals in Mahati.

 Others included a puppet show in Ramachandra Pushkarini and devotional music at Annamacharya Kalamandiram.

 ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

  

బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

తిరుమల, 2023 అక్టోబ‌రు 20 ; శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రావ్య సుమధుర ఆర్ట్స్, హైదరాబాద్ బృందం కూచిపూడి నృత్యప్రదర్శన సభను అబ్బురపరచింది.

ఈ నృత్యప్రదర్శన గణేశప్రార్థన ముదాకరాత్తమోదకంతో ప్రారంభమైంది. ఆపై జయము జయము లలితకళావాహికి, అనంతరం తిల్లాన కదనుతూహలం రాగంలో, తదుపరి కొలువైతివా రంగశాయి, దశావతార ప్రదర్శన కడు రమ్యంగా జరిగింది. వీక్షకులను భక్తిరస సాగరంలో ముంచెత్తింది.

రామచంద్రపుష్కరిణి వేదికపై శ్రీ పవన్ కుమార్, సత్యం, సత్తిబాబు, అంజిబాబు, హర్షవర్ధన్, రాణి, జయశ్రీ బృందం సమర్పించిన “తోలుబొమ్మలాట” సభాసదులను భక్తిరసవాహినిలో ముంచెత్తింది.

అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీ వాయునందన్ బ్రదర్స్ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం భ‌క్తుల‌కు భ‌క్తిభావాన్ని పంచింది. వీరికి వయోలిన్ పై వేంకటరమణ, మృదంగంపై వన్నూరుస్వామి సహకరించారు.
                                
తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం వేద సందేశం, శ్రీ అశేషనందస్వామి బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ‌పారాయ‌ణం, శ్రీ పవన్ కుమార్ బృందం భ‌క్తి సంగీతం, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టుకు చెందిన శ్రీ రంగరామానుజాచార్య భ‌క్తామృతం ధార్మికోప‌న్యాసం, సాయంత్రం శ్రీమతి యశోద బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, రాత్రి శ్రీ రాముడు బృందం హ‌రిక‌థా పారాయ‌ణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.