TIRUPPAVAI IS DRAVIDA VEDA- TIRUMALA CHINNA JEEYAR SWAMY _ ద్రవిడ వేదం తిరుప్పావై :తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి
Tirupati,16 December 2021: The Junior Pontiff of Tirumala, HH Sri Sri Sri Siriya Koil Kelviyappan Govinda Ramanuja Jeeyar (Tirumala Chinna Jeeyar ) Swami pronounced on Thursday that Tiruppavai, is being hailed as Dravida Veda for narrating the adorable bond between Devotees and Paramatma.
The Tiruppavai Pravachanams of Dhanur Masam organized by the TTD’s Alwar Divya Prabandam project commenced at the Annamacharya Kala Mandiram in Tirupati on Thursday.
In his Mangala Sasanam, the Tirumala pontiff said Goda Devi was one among the 12 Alwars who heralded the Srivari glory through Pasuras and first one to hail Sri Venkateswara as Govinda.
The Dharmic projects official Sri Vijayasaradhi said the Tiruppavai pravachanam program was organized by the TTD in 208 locations across the country during 30 days of Dhanur Masam to ignite the spiritual quotient among all devotees.
The TTD PRO Dr T Ravi narrated the significance of Godadevi contribution to the Bhakti cult in the country.
Scholar Sri Chakravarti Ranganathan will narrate the Dhanurmasa pravachanam every day from December 17 to January 14 while Smt Dwaram Lakshmi will render Pasurams.
Co-ordinator of Divya Prabandam project Sri Purushottam, Program Assistant Smt Kokila and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
ద్రవిడ వేదం తిరుప్పావై :తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి
తిరుపతి, 2021 డిసెంబరు 16: భారతీయుల వారసత్వ సంపద అయిన వేదాల సారమే తిరుప్పావై అని, భగవంతునికి, భక్తునికి మధ్య గల సంబంధాన్ని తెలిపే ఈ పాశురాలను ద్రవిడ వేదంగా పిలుస్తారని శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం ఉదయం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీవారి వైభవాన్ని పాశురాల ద్వారా వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి ఒకరని, వీరు కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని మొదటగా గోవిందా అని పిలిచారని తెలుస్తోందని అన్నారు. గోదాదేవి అనన్యమైన భక్తిభావనతో భగవంతుని కీర్తిస్తూ పాశురాలు రచించారని, పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులందరూ విని తరించాలని కోరారు. భగవంతుని ఆరాధనకు భాషతో పనిలేదని, భావన ముఖ్యమని చెప్పారు.
ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారథి మాట్లాడుతూ ధనుర్మాసంలో 30 రోజుల పాటు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించేందుకు తిరుప్పావై ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 208 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవి మాట్లాడుతూ విష్ణుచిత్తుని కుమార్తె అయిన గోదాదేవి అపరిమితమైన భక్తితో, ప్రేమతో రంగనాథస్వామివారిలో ఐక్యమైందన్నారు. భక్తులు కూడా ఇలాంటి భక్తిభావనతో భగవంతుని ఆరాధించాలన్నారు.
ప్రవచనకర్త శ్రీ చక్రవర్తి రంగనాథన్ స్వామి మాట్లాడుతూ సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడాన్నే ధనుర్మాసం అంటారని, ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పారు. గోదాదేవి అమ్మవారు పూమాలలతోపాటు పాశురాల మాలను శ్రీ రంగనాథస్వామికి సమర్పించారని వివరించారు.
కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ చక్రవర్తి రంగనాథన్ స్వామి తిరుప్పావై ప్రవచనాల పారాయణం చేస్తారు. శ్రీమతి ద్వారం లక్ష్మీ పాశురాలను వినిపిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.