TIRUPPAVAI PASURA SILVER HARAM DONATED TO GOVINDARAJA _ శ్రీ గోవిందరాజస్వామివారికి వెండి ఆభరణాల బహూకరణ
Tirupati, 14 Dec. 20: Pasuramala jewel has been donated to Lord Sri Govindaraja Swamy temple at Tirupati on Monday.
Tirupati based Abu Hatim Group MD Sri Surendra Raja’s daughter Smt Koustubha presented Tiruppavai Mala and Yagnopaveetamin silver.
These twin unique donated ornaments assumed importance as the auspicious Dhanurmasa is commencing from December 16 in thus famous and ancient Sri Govindaraja Shrine in Tirupati.
The Tiruppavai Pasura Haram worth around Rs.2.89lakhs weighing around 3.230kgs has 31 dollars with one Pasuram imbibed on each dollar. While the price of Yagnopaveetham is around Rs 57, 760/- weighing 750grams.
AEO Sri Ravi Kumar, Superintendent Sri Venkatadri, Temple Inspectors and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారికి వెండి ఆభరణాల బహూకరణ
తిరుపతి, 2020 డిసెంబరు 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి సోమవారం మధ్యాహ్నం వెండి తిరుప్పావై మాల మరియు యజ్ఞోపవీతం తిరుపతికి చెందిన అబూ హతీమ్ గ్రూపు ఎమ్‌డి శ్రీ సురేంద్ర రాజా కుమార్తె శ్రీమతి కౌస్తుభ స్వామివారికి బహూకరించారు. వీటిని దాతలు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడుకు అందజేశారు.
దాదాపు రూ.2 లక్షల 89 వేలు విలువ గల 3 కేజీల 230 గ్రాములతో 31 వెండి బిల్లలతో తయారు చేసిన తిరుప్పావై మాలను బహూకరించారు. ఇందులో ఒక్కొక్క బిల్లపై ఒక్కొక్క తిరుప్పావై పాశురాలను రచించారు. ధనుర్మాసం సంధర్భంగా 30 రోజులు పారాయణం చేసే 30 పాశురాలను వీటిపై లిఖించడం జరిగింది. అలాగే 750 గ్రాములతో తయారు చేసిన వెండి యజ్ఞోపవీతం కూడా అందజేశారు. దీని విలువ రూ.57,760/-
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర బాబు అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.