TIRUPPAVAI PRAVACHANAM COMMENCES _ తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కటాక్షం: శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి
TIRUPATI, 15 DECEMBER 2025: The month-long Tiruppavai Pasura Pravachanams commenced on a grand spiritual note with the Anugraha Bhashanam of both the senior and junior pontiffs of Tirumala on Monday evening.
The holy event took place at Annamacharya Kalamandiram of TTD in Tirupati. Every year Alwar Project of TTD observes this fete in the holy month of Dhanurmasam.
Every day Tiruppavai Pasura Pravachanams will be narrated by the scholar Sri Chakravarty Ranganatham between 7pm and 8pm while recited by renowned vocalist Dr Dwaram Lakshmi.
Annamacharya project Director Dr Medasani Mohan, Estate Officer of Tirupati Dr Suvarnamma and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కటాక్షం: శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి
వేదాల సారమే తిరుప్పావై : తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి
తిరుపతి, 2025 డిసెంబరు 15: తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రులు కావచ్చని శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి చెప్పారు.
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీవారి వైభవాన్ని పాశురాల ద్వారా వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి ఒకరిని చెప్పారు. గోదాదేవి అనన్యమైన భక్తిభావనతో భగవంతుని కీర్తిస్తూ పాశురాలు రచించారని తెలిపారు. భగవంతుని ఆరాధనకు భాషతో పనిలేదని, భావన ముఖ్యమని చెప్పారు.
అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, వేదాల సారమే తిరుప్పావై అని, ధనుర్మాసంలో 30 రోజుల పాటు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించేందుకు తిరుప్పావై ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఈ మాసంలోనే వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 233 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ప్రవచనకర్త శ్రీ చక్రవర్తి రంగనాథన్ మాట్లాడుతూ, సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడాన్నే ధనుర్మాసం అంటారన్నారు. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పారు. గోదాదేవి అమ్మవారు పూమాలలతోపాటు పాశురాల మాలను శ్రీ రంగనాథస్వామికి సమర్పించారని వివరించారు.
కాగా, ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ చక్రవర్తి రంగనాథన్ చే తిరుప్పావై పై ప్రవచనం ఉంటుంది. శ్రీమతి ద్వారం లక్ష్మి పాశురాలను గానం చేస్తారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్, టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ , ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ పురుషోత్తం, పుర ప్రజలు పాల్గొన్నారు.





