TIRUVADIPURM UTSAVAM COMMENCES _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం ప్రారంభం
TIRUPATI, 13 JULY 2023: Andal Tiruvadipuram Utsavam commenced in Sri Govindaraja Swamy temple on Thursday in Tirupati.
Ekadasi Tirumanjanam was performed to the Goddess on the occasion. The festival concludes on July 22.
DyEO Smt Shanti and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్ తిరువడిపురం ఉత్సవం ప్రారంభం
తిరుపతి, 2023, జూలై 13: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం గురువారం ప్రారంభమైంది. జూలై 22వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగనుంది.
ఈ సందర్భంగా ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఏకాదశి తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం సమర్పణ జరిగింది. ఆ తరువాత శ్రీ ఆండాళ్ అమ్మవారిని జిఎస్ మాడ వీధి, గాంధీ రోడ్డు మీదుగా గంగుండ్ర మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థానం నిర్వహించారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనంజయులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.