TODAY’S GENERATION NEEDS TO KNOW ABOUT GAURIPEDDI’s MASTERY – TTD CHAIRMAN SRI BHUMANA KARUNAKARA REDDY _ గౌరిపెద్ది పాండిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉంది

TIRUPATI, 10 September 2023: TTD Chairman Shri Bhumana Karunakara Reddy said that today’s generation needs to know about the versatility and great literary services of the immortal personality, Sri Gouri Peddi Ramasubba Sharma.

The Chairman graced as the chief guest at the meeting held at Sri Annamacharya Kalamandiram on Sunday in Tirupati on the occasion of the 101st birth anniversary of Sri Gauri Peddi Ramasubba Sharma. 

 

On this occasion, he released a special edition published on the erudite personality.

 

The TTD Board Chief said Sri Gauri Peddi was one of the eminent people who created wonderful literature.

 

He said that our ancestors have given us such scholarly power that we can become perfect if we go back to the past once and read it with our heart.  He said that he has tried to introduce such scholarship to today’s generation in the past and he will try again, and this should be done with the cooperation of all. “The youth of this generation should know about such great people to follow the righteous path”, he maintained.

 

SVIMS Director Dr. RV Kumar lectured on Navachandi Sampradayam-Vedikata, Sri Pamidi Kalva Madhusudhan, Dr. Nagarajya Lakshmi Gouri, Sri Shankara Bhagavan, son of Sri Gauri Peddi, Annamacharya project Director Dr. Akella Vibhishana Sharma also participated.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గౌరిపెద్ది పాండిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉంది

– 101వ జయంతి సభలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి


తిరుపతి 10 సెప్టెంబరు 2023: శ్రీ గౌరి పెద్ది రామసుబ్బ శర్మ పాండిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఎంతో ఉందని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి అన్నారు.

శ్రీ గౌరి పెద్ది రామసుబ్బ శర్మ 101వ జయంతి సందర్బంగా ఆదివారం రాత్రి శ్రీ అన్నమాచార్య కళామందిరంలో జరిగిన సభకు చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ గౌరి పెద్ది రామసుబ్బ శర్మ పై ప్రచురించిన ప్రత్యేక సంచికను ఈ సందర్బంగా ఆయన ఆవిష్కరించారు. శ్రీ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, అద్భుతమైన సాహితీ సృజన చేసిన ప్రముఖులలో శ్రీ గౌరి పెద్ది ఒకరని అన్నారు. తమ చిన్న తనంలో తెలుసుకున్న సాహితీ విషయాలను తలచుకుని నేటి తరం వారిని చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్ధితి ఉందన్నారు.అన్నమాచార్య కళామందిరం, త్యాగరాజమందిరం తిరుపతి లో గొప్ప సాహితీ వేదికలుగా నిలిచాయన్నారు. శ్రీ గౌరిపెద్ది వారి గురించి మాట్లాడటం తన అదృష్ట మన్నారు. నేటి తరం వారు తమ కంటే ముందున్న గొప్ప తరాన్ని గురించి తెలుసుకోలేక పోతున్నారనే బాధ ఉందన్నారు. నేటి తరానికి అలాంటి వారి గురించి తెలుసుకోవాలన్న తపన లేదని, చెప్పే వారు కూడా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నమాచార్య కళామందిరంతో తనకు చిన్న నాటి నుండి ఉన్న అనుభూతులను శ్రీ కరుణాకర రెడ్డి గుర్తు చేసుకున్నారు. నేటి కాలంలో సాహిత్య పుస్తకాలు చదివే అలవాటు తగ్గి పోయిందని, ఇది సమాజానికి మంచిది కాదని శ్రీ కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

గతాన్ని ఒక్కసారి తిరగేసి మనసుతో చదివితే పరిపూర్ణులు కాగలిగినంత పాండిత్య శక్తి పూర్వీకులు మనకు ఇచ్చారని ఆయన తెలిపారు. అలాంటి పాండిత్యాన్ని నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం గతంలో చేశానని, మరో సారి ప్రయత్నం చేస్తానని, ఇది అందరి సహకారంతో జరగాల్సిన పని అని ఆయన చెప్పారు.

స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ నవచండీ సంప్రదాయం- వైదికత, శ్రీ పమిడి కాల్వ మధుసూధన్ గౌరిపెద్ది వారి సాహిత్య సంవీక్షణం, డాక్టర్ నాగరాజ్య లక్ష్మి గౌరి పెద్దివారి పాండిత్యం-అవధాన పద్య సౌరభం అంశాలపై ఉపన్యసించారు. శ్రీ గౌరి పెద్ది కుమారులు శ్రీ శంకర భగవాన్ పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ సభకు అధ్యక్షత వహించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది