TRAINEE ASSISTANT COLLECTORS MEET TTD EO _ టిటిడి ఈవోను కలిసిన అసిస్టెంట్ కలెక్టర్లు
Tirumala, 16 Oct. 20: In all nine Assistant Collectors (IAS Probationers) from different districts of Andhra Pradesh who have come for an hands on experience on conducting Srivari Navaratri Brahmotsavam called on TTD EO Dr K S Jawahar Reddy on Friday morning.
The TTD EO who met them at the Annamaiah Bhavan appraised them about the second Brahmotsavam this year, which commenced today after Ankurarpanam yesterday and the key event of Garuda seva on October 20.
The EO also also appraised the IAS probationers about the Dharmic, Spiritual, Devotee Welfare, and other socio-economic activities taken up by the TTD lime hospitals, educational institutions and other charity activities etc.
He also briefed them on the administrative hierarchy, functions of senior management staff, TTD Trusts and programs for preserving and protecting Vedic knowledge and education.
There after the Visiting Assistant Collectors also called in the TTD additional EO Sri AV Dharma Reddy.
OSD of Reception Sri Prabhakar Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ఈవోను కలిసిన అసిస్టెంట్ కలెక్టర్లు
అక్టోబరు 16, తిరుమల 2020: రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 9 మంది అసిస్టెంట్ కలెక్టర్లు శుక్రవారం టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డిని తిరుమలలోని అన్నమయ్య భవనంలో మర్యాదపూర్వకంగా కలిశారు. టిటిడి కార్యకలాపాలపై అవగాహన పెంచుకునేందుకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పరిశీలించేందుకు అసిస్టెంట్ కలెక్టర్లు విచ్చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది అధిక మాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, గురువారం అంకురార్పణ జరిగిందని వివరించారు. శుక్రవారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని, ప్రధానంగా అక్టోబరు 20న గరుడసేవ జరుగుతుందని తెలిపారు. అనంతరం టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్యశాలలు, విద్యాసంస్థలు, ఎస్వీబీసీ గురించి వివరించారు. అదేవిధంగా టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు. టిటిడి నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులు, వేద విద్యవ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు వివరించారు. అనంతరం అసిస్టెంట్ కలెక్టర్లు టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో రిసెప్షన్ ఓఎస్‌డి శ్రీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.