TRIAL RUN HELD _ తిరుమల శ్రీ‌వారి సారె ట్ర‌య‌ల్ ర‌న్‌

TIRUPATI, 10 NOVEMBER 2024: The trial run of Panchami Thirtham Sare procession was held on Sunday from Komalamma Satram to Tiruchanoor temple.

The divine items that would be offered to Goddess Padmavati will be usually brought from Tirumala every year on the last day of Sri Padmavati Brahmotsavams.

The same was replicated on Sunday.

DyEO Sri Govindarajan, Dairyfarm Director Dr Harinath Reddy, VGO Smt Sada Lakshmi and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీ‌వారి సారె ట్ర‌య‌ల్ ర‌న్‌

తిరుపతి, 2024 న‌వంబ‌రు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివ‌రిరోజున భ‌క్తులు విశేషంగా విచ్చేసే పంచ‌మి తీర్థానికి తిరుమ‌ల నుండి వ‌చ్చే శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ ఆదివారం నిర్వ‌హించారు.

తిరుప‌తిలోని చెన్నారెడ్డి కాల‌నీలో గ‌ల శ్రీ వినాయ‌క స్వామివారి ఆల‌యం నుండి శ్రీ‌వారి సారె ఊరేగింపు ట్ర‌య‌ల్ ర‌న్ మొద‌లైంది. అక్క‌డి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ముందుగా శ్రీ కోదండ‌రామాల‌యం, చిన్న‌బ‌జారు వీధి, పాత హుజుర్ ఆఫీస్‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయం, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, బండ్ల వీధి, ఆర్‌టిసి బ‌స్టాండు, ప‌ద్మావ‌తి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని ప‌సుపు మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డినుండి శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్క‌రిణి వ‌ద్ద‌గ‌ల మండ‌పానికి సారెను వేంచేపు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.