TRIAL RUN PERFORMED ON REFILLING OF GALLERIES _ గ్యాలరీల రీఫిల్లింగ్ ట్రయల్ ర
Tirumala, 20 September 2023: As part of the ongoing annual Srivari Brahmotsavams in Tirumala, in connection with Garuda Seva on September 22, a trial run was conducted at Muthyapu Pandiri Vahana Seva on Wednesday night for refilling of galleries.
These arrangements have been made with an aim to provide darshan to more devotees during Garuda Seva.
From Supatham, the devotees were allowed to see the Pearl Canopy Vahana Seva and sent to East Mada Street. TTD Chairman Sri Bhumana Karunakar Reddy and EO Sri AV Dharma Reddy personally inspected these arrangements.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గ్యాలరీల రీఫిల్లింగ్ ట్రయల్ రన్
తిరుమల, 2023 సెప్టెంబరు 20: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబరు 22న గరుడ సేవ నాడు గ్యాలరీల రీఫిల్లింగ్ ను బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహనసేవలో ట్రయల్ రన్ నిర్వహించారు. గరుడ వాహనం నాడు ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.
సుపథం వద్ద నుంచి భక్తులను అనుమతించి ముత్యపు పందిరి వాహన సేవ దర్శనం కల్పించి తూర్పు మాడ వీధిలోకి పంపారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వయంగా ఈ ఏర్పాట్లను పరిశీలించారు. గోవిందనామ స్మరణలతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.