TRIBAL DANCES STEALS THE SHOW _ కల్పవృక్ష వాహనసేవలో కళాబృందాలు అద్భుత ప్రదర్శన
TIRUMALA, 07 OCTOBER 2024: On the fourth day of the ongoing annual brahmotsavams in Tirumala, the tribal dance forms charmed the devotees along the four mada streets during the Kalpavriksha Vahana Seva.
A total of 20 teams with 527 artists performed various arts to entertain the devotees in the galleries.
As part of this cultural bonanza, the Kommu Koya, Gondu, Dappulu, with rhythmic beats and steps made the devotees dance to the tunes.
All Projects Programme officials Sri Rama Gopal, Sri Raja Gopal, Sri Anandatheerthacharylu and other staff were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనసేవలో కళాబృందాలు అద్భుత ప్రదర్శన
తిరుమల, 2024 అక్టోబరు 07: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 20 కళాబృందాలు, 527 మంది కళాకారులు పాల్గొని తమ తమ కళాకృతులతో స్వామి వారిని ఆట పాటలతో సేవించున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళా బృందాలతో పాటు, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను సంబ్రమాశ్చర్యాలతో, భక్తిరసాన్ని నింపాయి. తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, హైదరాబాద్ నుండి వచ్చిన శ్రీ గణేశ్ బృందం కొమ్ము కోయ, గోండు నృత్యం భక్తులను ఆకట్టుకున్నాయి.
వికారాబాద్ నుండి వచ్చిన శ్రీ అశోక్ బృందం ప్రదర్శించిన కోయ నృత్యం, రాజమండ్రికి చెందిన శ్రీమతి రాణి బృందం కేరళ డ్రమ్స్, కడపకు చెందిన శ్రీబాబు బృందం ప్రదర్శించిన డప్పుల విన్యాసాలు ఆలరించాయి. బెంగళూరుకు చెందిన దీప్తి బృందం ప్రదర్శించిన కృష్ణామృత కల్పమ్ రూపకం, గురువాయూర్ కు చెందిన పి.టి.చంద్రన్ బృందం ప్రదర్శించిన తిరువట్టకాళి అనే ప్రదర్శన, జార్ఖండ్ కు చెందిన రూప్ సింగ్ బృందం ప్రదర్శించిన ఛండాలి నృత్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.
గుంటూరుకు చెందిన విజయలక్ష్మి ప్రదర్శించిన కాశ్మీరీ నృత్యం రెండు కళ్ళు చాలవు అన్నట్లు సాగింది. తమిళనాడుకు చెందిన సంధ్య బృందం ప్రదర్శించిన భరతనాట్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి పట్టణాలకు చెందిన కోలాట బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులను ఎంతగానో అలరించాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.