TTD ADDITIONAL EO LAUNCHES KIOSK _ కియోస్క్ మిషన్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో
Tirumala, 01 January 2025: TTD Additional EO Sri Ch.Venkaiah Chowdary inaugurated the Kiosk set up at Matrushri Tarigonda Vengamamba Annaprasadam Complex in Tirumala to donate to SV Anna Prasada Trust run by TTD on Wednesday.
This machine was donated to TTD by Union Bank of India.
Through these Kiosks, devotees can easily donate to by scanning the QR code and do the payment in UPI Mode.
Deputy EO Sri. Rajendra, IT DGM Sri. B. Venkateswara Naidu, Union Bank of India Tirupati Regional Head Sri. G. Ram Prasad, Deputy Regional Head Sri V. Brahmaiah, other officers of TTD and staff of the bank participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కియోస్క్ మిషన్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో
తిరుమల, 2025 జనవరి 01: టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్(KIOSK) మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, ఐటీ డీజీఎం శ్రీ బి.వెంకటేశ్వర నాయుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి రీజనల్ హెడ్ శ్రీ జి .రామ్ ప్రసాద్, డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీ వి.బ్రహ్మయ్య, ఇతర అధికారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.