TTD ADDITIONAL EO LAUNCHES KIOSK _ కియోస్క్ మిషన్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో
Tirumala, 01 December 2024: TTD Additional EO Sri Ch.Venkaiah Chaudary inaugurated the Kiosk set up at Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex (MTVAC) in Tirumala to donate for SV Anna Prasadam Trust run by TTD. This machine was donated by South Indian Bank.
Through these machines devotees can easily donate their required amount to SV Anna Prasadam Trust by scanning the QR code on the kiosk and payment through UPI.
TTD CVSO Sri. Sridhar, Deputy EO Sri. Rajendra, South Indian Bank General Manager Sri. T. M. Mohan, AGM Sri. V. Madhu, Chief Manager Sri. Venkat Rao, Tirupati Branch Head Sri. Ashok Vardhan participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కియోస్క్ మిషన్ ప్రారంభించిన టీటీడీ అడిషనల్ ఈవో
తిరుమల, 2024 డిసెంబరు 01: టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్(KIOSK) మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ప్రారంభించారు. ఈ మిషన్ ను సౌత్ ఇండియన్ బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది.
ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, సౌత్ ఇండియన్ బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ టి.ఎం.మోహన్, ఏజీఎం శ్రీ వి.మధు, చీఫ్ మేనేజర్ శ్రీ వెంకట్ రావు, తిరుపతి బ్రాంచ్ హెడ్ శ్రీ అశోక్ వర్ధన్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.