TTD ANNAPRASADAM DISTRIBUTION AS A PERPETUAL SPIRITUAL OFFERING _ నిరంతర యజ్ఞంగా టిటిడి అన్నప్రసాద వితరణ

DONOR-SPONSORED FULL DAY ANNAPRASADAM WITH RS. 44 LAKH CONTRIBUTION

DAILY ANNAPRASADAM TO 2.5 LAKH DEVOTEES

TIRUMALA, 11 JUNE 2025: TTD offers free Annaprasadam to devotees visiting Tirumala for the darshan of Sri Venkateswara as a perpetual sacrificial offering. This noble service began on April 6, 1985, when the “Sri Venkateswara Nithyannadanam Scheme” was launched at the hands of the then Chief Minister Sri Nandamuri Taraka Rama Rao.

Later, on April 1, 1994, it was formalized as the “Sri Venkateswara Nithyannadanam Trust” and eventually renamed the “Sri Venkateswara Annaprasadam Trust.” Initially, meals were served at the old Annadanam Complex opposite Kalyanakatta. To date, the Trust has received donations amounting to approximately Rs. 2,190 crores. With these contributions from generous donors, the Annaprasadam service continues uninterrupted.

Individuals can contribute Rs. 44 lakhs in their own name, in the names of family members, or in the name of trusts and companies. Donations are also welcome on auspicious days such as Shravana Nakshatram (Sri Venkateswara’s birthday), Uttaraashada Nakshatram (Sri Padmavathi’s birthday), Panchami Theertham, Vaikuntha Ekadasi, and other significant occasions.

Those who contribute Rs. 44 lakhs are given the opportunity to personally serve Annaprasadam, and their names will be displayed on the digital board at the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Bhavan in Tirumala. A full day’s Annaprasadam service requires Rs. 44 lakh. Alternatively, contributors may choose to donate Rs. 10 lakh for breakfast, Rs. 17 lakh for lunch, or Rs. 17 lakh for dinner.

Annaprasadam is currently served to approximately 2.5 lakh devotees every day across multiple locations including:

In Tirumala: Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex, 20 compartments in Vaikuntham Queue Complex-1, 31 compartments in Queue Complex-2, 9 compartments at Narayanagiri, ATC, MBC, TBC, PAC-2, PAC-4, and outside queue lines extending up to Krishnateja Guest house And Shilathoranam.

In Tirupati: Srinivasam and Vishnunivasam Complexes, Sri Govindaraja Swamy Temple Annaprasadam Center, Ruia Hospital, SVIMS, Maternity Hospital, BIRRD, and SV Ayurveda Hospital.

Other locations: Annaprasadam Bhavans in Tiruchanur and Vontimitta.

Every day, a large number of TTD employees and Srivari Sevaks work diligently in the preparation and distribution of Annaprasadam. This service has received immense appreciation from devotees and stands as a testament to TTD’s unwavering commitment to devotee welfare.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నిరంతర యజ్ఞంగా టిటిడి అన్నప్రసాద వితరణ

దాత రూ. 44 లక్షలతో రోజంతా అన్నప్రసాద వితరణ

రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ

తిరుమల, 2025, జూన్ 11.: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టిటిడి నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్‌ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టిటిడి ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది.

వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజులలో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు. రూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టిటిడి కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టిటిడి అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

దాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ – 2, పీఏసీ – 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్‌, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్‌, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు.

ప్రతి రోజూ టిటిడిలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుండి టిటిడి అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది. 

టిటిడి ముఖ్య ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.