TTD APPEALS TO DEVOTEES TO FOLLOW ALLOTTED TIME SLOTS _ ఎస్ఎస్ డి మరియు ఎస్ఈడి టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికే రావాలి : టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
TIRUMALA, 02 AUGUST 2024: TTD EO Sri J Syamala Rao on Friday appealed to the devotees to followed the allotted time slots on SED and SSD tokens, to avoid unnecessary waiting in Tirumala.
As many devotees are turning up for darshan much earlier than the allotted time slots on their SSD tokens and SED tickets, they are forced to wait for long hours.
TTD is allowing the devotees to enter the darshan queue lines only on their allotted reporting time specified on their tokens or tickets from the past few days.
But, still many devotees are coming to Tirumala, much earlier and facing the hardships of waiting outside.
Through the Dial your EO programme on Friday, TTD EO appealed to the devotees to follow the time slots unscrupulously to avoid the long waiting. “We are already making announcements in all the five languages including Telugu, Tamil, Kannada, Hindi and English for the information of the pilgrim public in Tirumala. We are starting the announcements at Tirupati Railway Station and Bus Stand also for the information of the devotees in a day or two”, he added.
The devotees can visit other temples in Tirupati or visit spiritual places in Tirumala instead of waiting outside the queue lines, the EO observed.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్ఎస్ డి మరియు ఎస్ఈడి టికెట్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికే రావాలి : టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
తిరుమల, 2024 ఆగస్టు 02: తిరుమలలో భక్తులు అనవసరంగా వేచి ఉండకుండా ఉండేందుకు ఎస్‌ఈడీ టికెట్స్, ఎస్‌ఎస్‌డీ టోకెన్లపై కేటాయించిన సమయాన్ని పాటించాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు శుక్రవారం భక్తులకు విజ్ఞప్తి చేశారు.
చాలా మంది భక్తులు తమ ఎస్‌ఎస్‌డి టోకెన్‌లు మరియు ఎస్‌ఇడి టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో, వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తోందన్నారు.
టిటిడి గత కొన్ని రోజులగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది.
కానీ, ఇప్పటికీ చాలా మంది భక్తులు చాలా ముందుగానే తిరుమలకు వచ్చి ఆరుబయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.
డయల్ యువర్ ఈఓ కార్యక్రమం ద్వారా, భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో భక్తుల సమాచారం కోసం ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌తో సహా మొత్తం ఐదు భాషల్లో ప్రకటనలు చేస్తున్నాం.
నేటి నుండి తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్‌లతో పాటు శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా కూడా భక్తుల సమాచార నిమిత్తం ప్రకటనలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉండకుండా, తిరుపతిలోని స్థానిక ఆలయాల సందర్శన లేదా తిరుమలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చని ఈవో తెలిపారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.