TTD APPEALS TO DEVOTEES NOT TO BELIEVE FALSE RUMOURS _ అవాస్తవాలను నమ్మవద్దు: భక్తులకు టిటిడి విజ్ఞప్తి
అవాస్తవాలను నమ్మవద్దు: భక్తులకు టిటిడి విజ్ఞప్తి
తిరుమల జూలై 3. 2024: తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతున్నది ఇది పూర్తిగా అసత్యం.
టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు మొన్న అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతేతప్ప వీటిపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు.
అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది
టీటీడీ ముఖ్యప్రజాసంబందాల అధికారిచే విడుదల చేయడమైనది