TTD BOARD CHIEF COMPLIMENTS SRM MANAGEMENT _ ఎస్.ఆర్.ఎం విశ్వవిద్యాలయం యాజమాన్యాన్ని అభినందించినటీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి
TIRUPATI, 09 JUNE 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Thursday complimented SRM Varsity Management for offering impeccable services during Maha Samprokshanam of SV temple at Venkatapalem.
The Varsity Pro Vice-Chancellor Prof Narayana Rao along with his team participated in Srivari Seva and offered services.
The Varsity Management has made arrangements of food to 500 members everyday and also provided lodging and boarding facilities to TTD deputation staffs.
The Chairman felicitated Prof Narayana Rao and also the religious team of TTD on the occasion.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్.ఆర్.ఎం విశ్వవిద్యాలయం యాజమాన్యాన్ని అభినందించినటీటీడీ చైర్మన్
శ్రీ వై వి సుబ్బారెడ్డి
అమరావతి, 2022 జూన్ 09: అమరావతి వెంకట పాలెం లోని శ్రీ వారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం సందర్భంగా విశేష సేవలందించిన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం యాజమాన్యాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి అభినందించారు.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం ప్రతిరోజు 500 మందికి ఆహారం, గురువారం ఉదయం 3 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 6 వేల మంది భక్తులకు భోజనం అందించి శ్రీవారి సేవలో పాల్గొంది. అదేవిధంగా టిటిడీ సిబ్బందికి వసతి, భోజన సదుపాయాన్ని, భక్తులకు రవాణా సౌకర్యాన్ని అందించింది.
ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం ప్రో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావును చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి శాలువాతో సన్మానించారు.
టిటిడి అధికారులను అభినందించిన చైర్మన్ శ్రీ వైవి. సుబ్బారెడ్డి
వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయాన్ని అద్భుత శిల్పకళా నైపుణ్యంతో, అతి తక్కువ వ్యవధిలో నిర్మింప జేసిన టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులను టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ అనంతరం చైర్మన్ అధికారులను అభినందించారు.
ఆగమ సలహాదారు, అర్చకులకు సన్మానం
ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక క్రతువులు చక్కగా నిర్వహించారని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఆగమ సలహాదారు శ్రీ విష్ణుభట్టాచార్యులు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చకులు, వేద పండితుల ను చైర్మన్ అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు వీరిని శాలువతో సన్మానించి వస్త్ర బహుమానం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ , అమరావతి లో శ్రీవారి ఆలయాన్ని టిటిడి అధికారులు, స్థపతులు, ఇంజనీరింగ్ సిబ్బంది అత్యద్భుతంగా రెండేళ్ల వ్యవధిలో నిర్మించినట్లు చెప్పారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.