TTD BOARD MEMBER DONATES 10 TONNES RICE TO TTD _ తితిదేకి పది టన్నుల బియ్యం విరాళం అందించిన శ్రీ చిట్టూరి రవీంద్ర
Tirupati, 30th May: In a noble gesture, TTD board member, former MP from Rajamundry and former MLA of Rajanagaram, Sri Chitturi Ravindra has donated ten tonnes of fine quality rice to TTD on Thursday.
The board member from Kakinada took a keen interest and supplied four different varieties of rice including 2.5 tonnes each of Nellore Sannalu, RGL variety, BPT type and Swarna rice. The total cost of this rice is estimated to be around 3.7 lakhs.
TTD Marketing Deputy EO Sri Chalapathi Babu and Procurement General Manager Sri Srinivasa Rao received the donation in the Marketing Godown at Tirupati.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
…
తితిదేకి పది టన్నుల బియ్యం విరాళం అందించిన శ్రీ చిట్టూరి రవీంద్ర
తిరుపతి, మే 30, 2013: తితిదే పాలకమండలి సభ్యులు, రాజమండ్రి మాజీ ఎంపీ, రాజానగరం మాజీ ఎమ్మెల్యే అయిన కాకినాడకు చెందిన శ్రీ చిట్టూరి రవీంద్ర గురువారం తితిదేకి పది టన్నుల మేలురకం బియ్యం విరాళంగా అందించారు. తిరుపతిలోని మార్కెటింగ్ కార్యాలయానికి లారీలో చేరుకున్న ఈ బియ్యాన్ని తితిదే మార్కెటింగ్ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చలపతిబాబు అందుకున్నారు.
శ్రీ చిట్టూరి రవీంద్ర అందించిన వివరాల మేరకు. మొత్తం పది టన్నుల్లో కాకినాడకు చెందిన రైస్ మిల్లర్ శ్రీ కృష్ణారెడ్డి అరటన్ను విరాళంగా అందించినట్టు తెలిపారు. ఇందులో నెల్లూరు సన్నాలు 2.5 టన్నులు, ఆర్‌జిఎల్ రకం 2.5 టన్నులు, బిపిటి రకం 2.5 టన్నులు, స్వర్ణ రకం బియ్యం 2.5 టన్నులు ఉన్నట్టు వివరించారు. వీటి మొత్తం విలువ రూ.3.70 లక్షలని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం తితిదే కొనుగోలు చేస్తున్న బియ్యం ధర కంటే తక్కువకు బియ్యం సరఫరా చేసేందు తమ ప్రాంత మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా శ్రీ చిట్టూరి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.