TTD CHAIRMAN AND EO ENQUIRE SRI GT INJURED AT BIRRD HOSPITAL _ క్షత గ్రాత్రులను పరామర్శించిన టీటీడీ చైర్మన్, ఈవో

Tirupati, 1 June 2023: TTD chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy along with Board member Sri P Asok on Thursday evening visited the BIRRD hospital and enquired about injured persons in the Sri Govindaraja Swamy temple incident. 

The injured from Tirupati included Sri Chandrasekhar, Smt Baby and Kumari Niharika had suffered serious injuries and were treated at the hospital. 

TTD officials spoke to the injured and assured them of all medical support. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

క్షత గ్రాత్రులను పరామర్శించిన టీటీడీ చైర్మన్, ఈవో

తిరుపతి 1 జూన్ 2023: శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో రావి చెట్టుకూలిన సంఘటనలో గాయపడి బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ గురువారం రాత్రి పరామర్శించారు.

తిరుపతికి చెందిన క్షతగాత్రులు శ్రీ చంద్రశేఖర్ , శ్రీమతి బేబి, కుమారి నిహారిక ఆరోగ్య పరిస్థితి గురించి వీరు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది