TTD CHAIRMAN AND EO INVITES KARNATAKA CM FOR KANNADA SVBC CHANNEL INAUGURATION _ ఎస్ వి బి సి కన్నడ ఛానల్ ప్రారంభోత్సవానికి రండి_ కర్ణాటక సీఎంను ఆహ్వానించిన టిటిడి చైర్మన్,ఈఓ
Tirupati, 02 October 2021: TTD Chairman Sri YV Subba Reddy along with the TTD EO Dr KS Jawahar Reddy on Saturday morning invited the Honourable CM of Karnataka Sri Basavaraj Bommai to participate in the inaugural event of SVBC Kannada channel on October 11.
TTD Chairman and the EO handed over the invitation for the inaugural event to the CM of Karnataka in the latter’s camp office at Bengaluru.
They also informed that the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy would also participate in the event.
After presenting prasadams, the Chairman and EO sought the support of the Karnataka Government in the development of the Kannada channel to which the Karnataka CM gave his nod.
Expressing his pleasure to take part in the event, the Karnataka CM also said through the SVBC Kannada channel the Dasa Padas shall be glorified in a big manner.
TTD board member from Karnataka Sri Vishwanath Reddy and Srivari temple OSD Sri Pala Sheshadri were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్ వి బి సి కన్నడ ఛానల్ ప్రారంభోత్సవానికి రండి
కర్ణాటక సీఎంను ఆహ్వానించిన టిటిడి చైర్మన్,ఈఓ
తిరుపతి 2 అక్టోబర్ 20 21: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడోత్సవం నాడు ఎస్ వి బి సి కన్నడ ఛానల్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మైని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.
శనివారం బెంగుళూరులో వారు సిఎం శ్రీ బసవరాజ్ బొమ్మైని కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ , హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా, అక్టోబర్ 11వ తేదీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గరుడోత్సవం సందర్భంగా కన్నడ తో పాటు హిందీ ఛానల్ కూడా ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారని, మీరు కూడా హాజరు కావాలని కోరారు. ఎస్ వి బి సి కన్నడ ఛానల్ అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీ బసవ రాజ్ బొమ్మై మాట్లాడుతూ, ఎస్ వి బి సి ఛానల్ కు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలన్నీ అందిస్తామని చెప్పారు. కన్నడ చానల్ వల్ల పురందర దాసుల కీర్తనల ప్రచారంకూడా అవుతుందని అన్నారు. ఛానల్ ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానని చెప్పారు.
సిఎం కు టిటిడి చైర్మన్, ఈవో శ్రీవారి ప్రసాదాలు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను అందించి శాలువతో సత్కరించారు. టీటీడీ పండితులు సిఎం కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం చైర్మన్, ఈవో లను సిఎం శాలువతో సత్కరించారు. టీటీడీ పాలక మండలిసభ్యులు శ్రీ విశ్వనాథరెడ్డి, శ్రీవారి ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది