TTD CHAIRMAN CONDEMNS FALSE NEWS _ శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తం – టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు
Tirumala, 17 October 2025: The TTD Chairman Sri BR Naidu has seriously condemned the news by a few media on increasing the prices of Srivari Laddu Prasadam, terming them as completely false.
TTD Chairman Sri BR Naidu said that it is not right for some people to spread false information with a malicious intention of damaging the reputation of TTD and the state government.
The Chairman also said that legal action will be taken against those fake news spreaders.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తం – టిటిడి చైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుమల, 2025, అక్టోబర్ 17: శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచుతున్నట్లు కొందరు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చౌకబారు వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఇలాంటి వార్తలు పూర్తి అబద్దమైనవని, ఆధారాలు లేని వార్తలని ఆయన ఖండించారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టిటిడి లడ్డూ ప్రసాదాల ధరలను పెంచే ఆలోచనేలేదని ఆయన స్పష్టం చేశారు.
