TTD CHAIRMAN INAUGURATES TIRUCHANOOR SRI PADMAVATHI REST HOUSE COMPLEX _ తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం పర్యాటక శాఖకు అప్పగింత
Tiruchanoor, 5 March 2020 : TTD chairman Sri YV Subba Reddy on Thursday inaugurated Sri Padmavathi Nilayam (Rest House complex) built at a cost of ₹74.70 crore in Tiruchanoor ahead of handing it over to the Tourism Corporation for maintenance.
The Tirupati MLA and TTD board special invitee Sri Bhuvana Karunakar Reddy and Chandragiri MLA Dr C Bhaskar Reddy participated.
Speaking to reporters on the ocassion the chairman said 8 floor complex comprising of 4.26 lakh square feet over 5.35 acres had a cellar space adequate to park 135 vehicles with 200 rooms(80 a/c ,and 120 non-a/c, five dormitories ( 1AC, and 4 non-A/C) to accommodate nearly 1600 devotees.
He said the complex located on highway was convenient for devotees and pilgrims who could book rooms online as well and said the first floor comprised of a Reception, time slot Darshan and Srivani counters, ATMs, Cloak room and restaurants are located. The cellar floor. besides parking, space is created for water storage sewerage treatment plant, transformers, generators etc
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం పర్యాటక శాఖకు అప్పగింత
తిరుపతి, 2020 మార్చి 05 ;తిరుచానూరులో నిర్మించిన శ్రీ పద్మావతి నిలయం వసతి సముదాయంలో గురువారం టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి పూజలు నిర్వహించి రాష్ట్ర పర్యాటక శాఖకు అప్పగించారు. ఛైర్మన్ వెంట తిరుపతి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ యాత్రికుల సౌకర్యార్థం 4.26 లక్షల చదరపు అడుగులలో దాదాపు రూ.74.70 కోట్లతో ఈ వసతి సముదాయాన్ని నిర్మించినట్టు తెలిపారు. ఇందులో 120 నాన్ ఏసీ గదులు, 80 ఏసీ గదులు, 4 నాన్ ఏసీ డార్మిటరీలు, 1 ఏసీ డార్మిటరీ ఉన్నాయన్నారు. ఇక్కడ శ్రీవాణి ట్రస్టు విరాళాల స్వీకరణ కౌంటర్, టైంస్లాట్ సర్వదర్శనం కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. హైవే పైన ఉండడంతో యాత్రికులకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా ఇక్కడి గదులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సత్యనారాయణ, డివిఎం శ్రీసురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.