TTD CHAIRMAN INSPECTS DEVOTEES FACILITIES AT TIRUMALA _ తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్‌

Tirumala, 28 February 2020: TTD Trust Board Chairman Sri YV Subba Reddy and Additional Executive Officer Sri AV Dharma Reddy on Friday morning made spot inspection of regions to monitor the facilities provided to the pilgrims by TTD.

After partaking in Anna Prasadam along with devotees at Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex, speaking to media the Chairman said that the devotees have expressed happiness about drinking water facilities and also complimented on TTD’s decision to ban plastic usage in Tirumala to protect the environs.

The Chairman said that TTD had set up RO plants at all locations of devotee congregation at Tirumala to provide clean and pure Jala Prasadam. None of the devotees also have made any complaint about plastic bottles ban and in fact offering support for the noble cause”, he observed.

Earlier the inspection began from ATC followed by Vaikuntam Queue Complex and reached Supatham. Thereafter they visited Kalyanakatta and inspected the tonsuring activity.

Later on the Chairman and Additional EO, inspected the shops and outlets near Sri Bedi Anjaneya temple and Anna Prasadam Complex where they personally verified the hygiene and taste of food.

TTD VSO Sri Manohar, DyEO of Srivari temple Sri Harindranath, DyEO of Anna Prasadam Sri Nagraja, Catering Officer Sri GLN Shastri, DyEO Kalyanakatta Sri Selvam and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఛైర్మ‌న్‌

తిరుమ‌ల‌, 2020 ఫిబ్ర‌వ‌రి 28: తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో భ‌క్తులకు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్ర‌వారం అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు. త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం వ‌ద్ద భ‌క్తుల‌తో క‌లిసి జ‌ల‌ప్ర‌సాదం స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల నిషేధం వ‌ల్ల ఎలాంటి ఇబ్బందీ లేద‌ని భ‌క్తులు చెబుతున్నార‌ని, జ‌ల‌ప్ర‌సాదం నీటిపై సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్ని ముఖ్య‌మైన ప్రాంతాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి స్వ‌చ్ఛ‌మైన జ‌ల‌ప్ర‌సాదం నీటిని అందిస్తున్నామ‌ని చెప్పారు. ఈ నీటి వినియోగంపై భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని, భ‌క్తులు కూడా ఈ జ‌ల‌ప్ర‌సాదాన్ని ప‌విత్రంగా భావించి తాగుతున్నార‌ని వివ‌రించారు. ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధంపై భ‌క్తుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవ‌న్నారు.

ముందుగా ఎటిసి నుండి ప్రారంభించి  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా సుప‌థం వ‌ద్ద‌కు చేరుకున్నారు. సుప‌థం మార్గం ద్వారా ఎవ‌రెవ‌రిని అనుమ‌తిస్తార‌ని అడిగి తెలుసుకున్నారు. అక్క‌డినుండి ప్ర‌ధాన కల్యాణ‌క‌ట్టకు చేరుకుని క్షుర‌కులు త‌ల‌నీలాలు తీయ‌డాన్ని, అక్క‌డి వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు.  అనంత‌రం శ్రీ బేడి ఆంజ‌నేయస్వామివారి ఆల‌యం వ‌ద్ద గ‌ల దుకాణాలను ప‌రిశీలించారు. అక్క‌డి నుండి అన్న‌ప్ర‌సాద భ‌వ‌నానికి చేరుకుని రుచి, శుచిపై భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ భ‌క్తుల‌తో క‌లిసి జ‌ల‌ప్ర‌సాదం స్వీక‌రించారు.

ఛైర్మ‌న్ వెంట టిటిడి విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజ‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, క‌ల్యాణ‌క‌ట్ట డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం త‌దిత‌రులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.