TTD CHAIRMAN INSPECTS PARAKAMANI AND POTU _ తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
Tirumala, 01 February 2025: On Saturday, TTD Chairman Sri. BR Naidu conducted a surprise inspection to Boondi Potu and Parakamani buildings in Tirumala.
He first inspected the Parakamani building and inquired about the process of seggregation of coins, notes, gold, silver and other gifts offered by devotees in Srivari Hundi.
He later enquired how the personnel participating in the counting would be checked and also observed CCTV surveillance in the Parakamani building,
Later at Boondi Potu, the Chairman examined the production of Boondi, tins of ghee, mixing of flour and the process of moving raw materials into the temple through conveyor belt. On this occasion, while talking to the Potu staff, he advised them to be clean and devout in performing their duties.
The officers were instructed to be careful to avoid any accidents in Potu.
Later, he inspected the laddu complex and interacted with many devotees and also randomly verified the weight of the laddus.
On this occasion, the officials concerned were ordered to take measures so that the devotees do not face any trouble at the Laddu Complex.
After reaching the Srivari temple, he visited temple potu and asked the officials about the method of making laddus there and expressed satisfaction over the method of preparation.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
తిరుమల, 2025 ఫిబ్రవరి 01: తిరుమలలోని బూందీపోటు, పరకామణి భవనంలో శనివారం టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ముందుగా పరకామణి భవనాన్ని పరిశీలించిన ఆయన నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏవిధంగా తనిఖీ చేస్తారని ఆరా తీశారు. పరకామణి భవనంలో సిసి టివి నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం బూందీపోటుకు చేరుకున్న చైర్మన్ బూందీ తయారీ, నెయ్యి టిన్ లు, పిండి మిక్సింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా ముడి పదార్థాలను ఆలయంలోకి తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోటు సిబ్బందితో మాట్లాడుతూ విధి నిర్వహణలో పరిశుభ్రంగా భక్తిభావంతో ఉండాలని సూచించారు. పోటులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తతో ఉండాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసి పలువురు భక్తులతో మాట్లాడారు. లడ్డూ బరువును లడ్డూ కేంద్రంలో తూకం వేసి పరాశీలించారు. ఈ సందర్భంగా లడ్డూ కేంద్రంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని ఆలయంలోని లడ్డూ పోటును పరిశీలించారు. అక్కడ లడ్డూ తయారు చేసే విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.