TTD CHAIRMAN INSPECTS SITE FOR CHILDREN’S MULTI SPECIALITY HOSPITAL _ చిన్నపిల్లల మల్టీ సూపర్ హాస్పిటల్ స్థల పరిశీలన చేసిన టీటీడీ చైర్మన్
DIRECTS OFFICIALS TO COMPLETE TENDER PROCESS
Tirupati, 24 March 2022: TTD Chairman Sri YV Subba Reddy on Thursday inspected the site chosen for constructing the children’s multi super speciality hospital in the Ruia hospital complex and directed officials to complete the tender process at the earliest.
Along with officials, the TTD Chairman witnessed the land levering of 6-1/2 acres of land in the Ruia Hospital that was already selected by the TTD board.
He suggested officials to make a second entry gate from the Zoo park road and also a service road from Bharathiya Vidya Bhavan school road for benefit of devotees.
Speaking to the media later Sri Subba Reddy said the TTD board had already resolved to construct the hospital at a cost of ₹240 crore. The tenders have been sent for judicial preview and soon after approval, the officials are directed to call for tenders
He said the foundation stone for the Children’s Hospital will be laid in Tirupati by Honourable AP CM Sri YS Jaganmohan Reddy when he comes for the inauguration of the TATA Trust Cancer Hospital at Tirupati in April.
TTD CE Sri Nageswara Rao, Estate OSD Sri Mallikarjuna and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
చిన్నపిల్లల మల్టీ సూపర్ హాస్పిటల్ స్థల పరిశీలన చేసిన టీటీడీ చైర్మన్
– టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
తిరుపతి 24 మార్చి 2022: టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న చిన్న పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గురువారం పరిశీలించారు.
రుయా ఆసుపత్రి ఆవరణంలో ఆరున్నర ఎకరాల్లో ఆసుపత్రి నిర్మించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ సుబ్బారెడ్డి అధికారులతో కలసి స్థల పరిశీలన చేసి అక్కడ జరుగుతున్న భూమి చదును చేసే పనులు చూశారు. రుయా ఆసుపత్రి నుంచే కాకుండా జూపార్కు రోడ్డు నుంచి కూడా ఈ ఆసుపత్రికి ప్రవేశ మార్గం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. దీంతోపాటు భారతీయ విద్యా భవన్ మార్గం లో నుంచి కూడా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ,సుమారు రూ 240 కోట్లతో చిన్న పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందన్నారు. టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూ కు పంపారనీ, త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగనోహ్మన్ రెడ్డి టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలోనే ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేయిస్తామని చైర్మన్ చెప్పారు.
టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్టేట్ విభాగం ఓఎస్డి శ్రీ మల్లిఖార్జున ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది