TTD CHAIRMAN INVITES AP CM FOR SRIVARI BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి రాష్ట్రముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో ఆహ్వానం
Amaravati/Tirumala, 17 September 2025: TTD Chairman Sri BR Naidu along with the EO Sri Anil Kumar Singhal, board member Smt Janaki Devi, and Additional EO Sri Ch Venkaiah Chowdary presented Brahmotsavam invitation booklet to the Honourable CM of AP Sri N Chandrababu Naidu and invited him for the annual mega religious festival.
The top brass team from TTD had formally met the AP CM in the later\’s camp office at Velagapudi on Wednesday.
On this occasion the TTD Vedic scholars offered blessings to the CM of AP.
The Chairman and EO briefed the Chief Minister over the ongoing arrangements for the big fete in Tirumala that is scheduled from September 24 to October 02.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
రాష్ట్ర ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో ఆహ్వానం
తిరుమల, 2025 సెప్టెంబరు 17: ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యురాలు శ్రీమతి జానకి దేవి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. బుధవారం ఉదయం వెలగపూడిలోని క్యాంప్ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు. తరువాత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.
అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్, ఈవో గౌరవ ముఖ్యమంత్రికి వివరించారు.



