TTD CHAIRMAN INVITES KANCHI SEER FOR SRI YAGAM _ శ్రీ‌యాగానికి విచ్చేయండి – కంచి స్వామికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తుల ఆహ్వానం

TIRUPATI, 21 JANUARY 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Friday evening invited Kanchi Peetham Pontiff Sri Vijayendra Saraswati Mahaswami for the ongoing Sri Yagam at Tiruchanoor.

The TTD Board Chief called on the Seer at the latter’s Mutt in Tirupati. He explained to the Pontiff the purpose of Yagam which is being performed after a gap of five decades.

The Pontiff also accepted the invitation and said he would definitely take part in Sri Yagam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌యాగానికి విచ్చేయండి

– కంచి స్వామికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తుల ఆహ్వానం

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 21: తిరుచానూరులో టిటిడి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న న‌వ‌కుండాత్మక శ్రీ‌యాగానికి విచ్చేయాల‌ని కంచి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు ఆహ్వానించారు. శుక్ర‌వారం సాయంత్రం వారు కంచి మఠంలో పీఠాధిప‌తిని క‌లిశారు. 50 సంవ‌త్స‌రాల త‌రువాత తిరుచానూరులో న‌వ‌కుండాత్మక శ్రీ‌యాగం నిర్వ‌హిస్తున్న‌ట్టు వారు వివ‌రించారు. శుక్ర‌వారం ప్రారంభ‌మైన ఈ యాగంలో చివ‌రిరోజైన జ‌న‌వ‌రి 27వ తేదీ పూర్ణాహుతి కార్య‌క్ర‌మానికి విచ్చేయాల‌ని కోరారు. యాగంలో త‌ప్పకుండా పాల్గొంటామ‌ని కంచి స్వామి తెలియ‌జేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.