TTD CHAIRMAN LAYS FOUNDATION STONE TO VENGAMAMBA DHYANA MANDIRAM AT TIRUMALA _ వెంగమాంబ ధ్యాన‌మందిరానికి టిటిడి ఛైర్మన్ శంకుస్థాపన

MP DONATES Rs.5Cr TOWARDS THE CONSTRUCTION

 

TIRUMALA, 29 APRIL 2022:  TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Friday morning laid foundation stone to Matrusri Tarigonda Venkagamamba Dhyana Mandiram in Tirumala.

 

Speaking on the occasion, he said, Matrusri Vengamamba was considered as one of the ardent devotees of Sri Venkateswara Swamy who had not only rendered Sankeertana Seva like Sri Tallapaka Annamacharya but also pioneered Annaprasadam in Tirumala. “She used to meditate in the divine abode and attained salvation. With the largesse by the Honourable Member of Parliament (Rajya Sabha) Sri A Ayodhya Rami Reddy, a Dhyana Mandiram will be constructed at Rs.5cr in 1.5acre area wherein nearly 350 devotees can meditate”, the TTD Board Chief added.

 

Later the donor, Sri Ayodhya Rami Reddy expressed his gratitude to Sri Venkateswara Swamy for providing an opportunity to render his part towards the construction of the Dhyana Mandiram at Tirumala and also thanked the TTD Chairman and mandarins on the occasion.

 

Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri Veerabrahmam, Smt Sada Bhargavi, CE Sri Nageswara Rao, Additional CVSO Sri Siva Kumar Reddy, EE Sri Jaganmohan Reddy and other officers were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

 

వెంగమాంబ ధ్యాన‌మందిరానికి టిటిడి ఛైర్మన్ శంకుస్థాపన

– ఈ నిర్మాణానికి రూ.5 కోట్లు విరాళం అందించిన ఎంపి

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 29: తిరుమలలోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావంలో నిర్మించనున్న ధ్యానమందిరానికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పరమ భక్తురాలు అయిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ శ్రీ అన్నమాచార్యుల తరహాలో సంకీర్తన సేవతోపాటు తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికారని తెలిపారు. తిరుమలలో చాలాకాలం పాటు ఆమె ధ్యానం చేశారని, ధ్యానం చేస్తూనే శ్రీవారిలో ఐక్యమయ్యారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు శ్రీ ఎ.అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా దాత శ్రీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధ్యానమందిరం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు. ఇందుకు సహకరించిన టిటిడి చైర్మన్ కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఇఇ శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.