TTD CHAIRMAN  MAIDEN VISIT TO VONTIMITTA TEMPLE _ శ్రీ సీతారాముల కళ్యాణానికి వైభవంగా ఏర్పాట్లు: టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

OVER 50 THOUSANDS EXPECTED FOR KALYANAM

VONTIMITTA, 09 MARCH 2025: TTD Chairman Sri BR Naidu visited Vontimitta Sri Kodandarama Swamy temple on Sunday in Kadapa district.

He was given traditional Purna Kumbha Swagatam amidst chanting of Vedic hymns by temple priests on his maiden visit to the temple and was received by JEO Sri Veerabrahmam.

Later he reviewed TTD and district officials on the ongoing arrangements in the meeting hall at the temple premises. 

Speaking on the occasion the TTD board chief said as per the instructions of the Honourable Chief Minister of AP Sri N Chandrababu Naidu, TTD is making elaborate arrangements for the annual festival in a big way this year.

He asked the TTD and district officials to ensure that the festival is conducted in a hassle free manner keeping in view the past experiences and suggested them to constitute coordination committees.

There should not be any gaps in the distribution of Annaprasadam, water, butter milk etc. All the devotees who attended the celestial wedding should get the packet of Talambralu as Prasadam on the day of Sita Rama Kalyanam, he observed.

Later he also reviewed on Srinivasa Kalyanam at Amaravathi on March 15. As the celestial marriage is taking place for the first time in the Sri Venkateswara Swamy temple at Venkatapalem, he asked the officials to make elaborate arrangements for the big wedding as tens of thousands of devotees are being expected to take part in the Tiru Kalyanam.

In this meeting, TTD officers including Deputy EOs Sri. Natesh Babu, Sri. Govinda Rajan, Sri. Selvam, Smt. Prashanthi, SEs Sri. Venkateswarlu, Sri. Manoharam, VGO Smt. Sadalakshmi, Press and Sales Wing Special Officer Sri. Ramaraju and Kadapa district officials including RDO Sri John Irwin, DSP Sri Venkateswarlu, others were also present.  

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సీతారాముల కళ్యాణానికి వైభవంగా ఏర్పాట్లు: టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

కల్యాణ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించిన టిటిడి ఛైర్మన్

మార్చి 15న అమరావతిలో శ్రీనివాస కల్యాణోత్సవం

ఒంటిమిట్ట/తిరుపతి 2025, మార్చి 09.: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారు. ఒంటిమిట్టలోని పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. టిటిడి అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్ధంగా, నిర్మాణాత్మకంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తులకు అందరికీ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు అందేంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల తాకిడికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

శ్రీ సీతారాముల కళ్యాణం రోజున ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగ రాదని, అవసరమైన జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు, వేసవి నేపథ్యంలో అగ్ని మాపక శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆహ్వానం పత్రికలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు. శాఖలవారీగా అధికారులు చేయనున్న పనులను ఛైర్మన్ కు నివేదించారు.

అంతకు ముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని టిటిడి ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కల్యాణ వేదిక ప్రాంగణాన్ని చక్కని పుష్ప, విద్యుత్ అలంకరణలతో అలంకరించాలని సూచించారు. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో పటిష్టంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వేసవి నేపథ్యం, అనుకోకుండా వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ఛైర్మన్ కు జేఈవో నివేదించారు.

మార్చి 15న అమరావతిలో శ్రీనివాస కళ్యాణోత్సవం

అమరావతి లోని వేంకట పాలెంలో మార్చి 15వ తేదీన జరుగనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామి వారి కళ్యాణాన్ని అందరూ చూసి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమరావతిలోని టిటిడి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి శ్రీనివాస కళ్యాణోత్సవం జరుగుతోందని, భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు.

ఈ సమావేశంలో కడప ఆర్డీవో శ్రీ జాన్ ఇర్విన్, డిఎస్పీ శ్రీ వేంకటేశ్వర్లు, టిటిడి డిప్యూటీ ఈవో లు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, గోవింద రాజన్, శ్రీ సెల్వం, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ కుమార్, వీజీవో శ్రీమతి సదాలక్ష్మి, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీ వి. ఆదినారాయణ రెడ్డి, సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు, ఏవీఎస్వో శ్రీ వై సతీష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.