TTD CHAIRMAN MEETS KANCHI KAMAKOTI PEETHADHIPATHI _ కంచి కామకోటి పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
Tirumala, 08 December 2024: TTD Chairman Sri BR Naidu has formally met the Chief Pontiff of Kanchi Kamakoti Peetham, HH Sri Sri Vijayendra Saraswati Swamiji on Sunday evening at Kanchi Mutt in Tirumala
Speaking to the Chairman on this occasion, the Swamiji appreciated the recent decisions taken by the new Board of Trustees of TTD.
He said that it is commendable to take decisions to protect the sanctity of Tirumala and in the benefit of the devotees.
He advised the Chairman to make Tirumala a more beautiful spiritual place and to work for the spread of Vedic education.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కంచి కామకోటి పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్
తిరుమల, 2024 డిసెంబరు 08: కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఆదివారం సాయంత్రం తిరుమలలోని కంచి మఠంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ ను ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా స్వామీజీ చైర్మన్ తో మాట్లాడుతూ టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా , భక్తులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు. తిరుమలను మరింత సుందర దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని, వేదవిద్య వ్యాప్తికి కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.