TTD Chairman offered Asthalakshmi Kanthabharanam to Lord _ శ్రీవారికి అష్టలక్ష్మి కంఠాభరణాలను బహూకరించిన తి.తి.దే ఛైర్మెన్ దంపతులు
శ్రీవారికి అష్టలక్ష్మి కంఠాభరణాలను బహూకరించిన తి.తి.దే ఛైర్మెన్ దంపతులు
తిరుమల, 27 మార్చి – 2013 : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పాల్గుణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా తి.తి.దే ఛైర్మెన్ శ్రీ కనుమూరిబాపిరాజు మరియు వారి సతీమణి శ్రీమతి అన్నపూర్ణాదేవి సహితంగా అష్టలక్ష్మి కంఠాభరణాన్ని బుధవారంనాడు తిరుమల శ్రీవారి ఆలయంలో బహూకరించారు.
కాగా బుధవారంనాడు సాక్షాత్తు శ్రీలక్ష్మీదేవి జన్మనక్షత్రం కూడా కావడం విశేషం. ఈ సందర్భంగానే ఈ అపూర్వ కంఠాభరణాన్ని స్వామివారికి బహూకరించినట్లు తెలిపారు.
తి.తి.దేకు అంబులెన్సు బహూకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు
తిరుమలలో బుధవారంనాడు మధ్యాహ్నం శ్రీవారి ఆలయం ఎదుట రూపాయలు 21 లక్షలు విలుచేసే అంబులెన్సు వాహనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు తి.తి.దేకు బహూకరించింది. ఈ సందర్భంగా తి.తి.దే ఛైర్మెన్ శ్రీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ భక్తులకు అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందించడానికి ఈ అంబులెన్సు సేవలు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ అంబులెన్సు బహూకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు మేనేజింగ్ డైరెక్టరు శ్రీ భగవంతరావు మరియు సిబ్బందిని ఆయన ప్రశంసించారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.