TTD CHAIRMAN OFFERS PATTU VASTRAMS TO SIMHACHALAM APPANNAసింహాచలం అప్పన్నకు టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాల సమర్పణ
Visakhapatnam/TIRUMALA, 30 APRIL 2025: TTD Chairman Sri B.R. Naidu offered Pattu vastrams to Sri Varaha Lakshmi Narasimha Swamy (Appanna) at the Simhachalam temple near Visakhapatnam on Wednesday.
Since 1996, TTD has been offering these clothes every year during the Chandanotsavam festival. Simhachalam is one of the oldest Narasimha temples in India, and the idol here is believed to be self-manifested.
The Chandanotsavam festival began in the early hours. The idol is usually covered with sandalwood paste throughout the year. Only on the auspicious day of Akshaya Tritiya, the sandal paste is removed for 12 hours so that the devotees can see the presiding deity in Nija Rupa(original form) clearly. Then, a fresh layer of sandal paste is applied again.
On this special day, TTD offered the vastrams on behalf of Sri Venkateswara Swamy temple.
TTD Dy EO Sri Lokanatham, Bokkasam In-charge Sri Guru Raja Swamy, and other officials were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సింహాచలం అప్పన్నకు టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాల సమర్పణ
విశాఖపట్నం/తిరుమల, 2025 ఏప్రిల్ 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విశాఖపట్నం సమీపంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి(అప్పన్న) టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు.
టీటీడీ 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తరుపున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దేశంలోని అన్ని నరసింహస్వామి క్షేత్రాల్లో సింహాచలం అతి ప్రాచీనమైనదని, స్వామివారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు.
సింహగిరిపై కొలువైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది. సింహాచలం అప్పన్న విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంటుంది. సంవత్సరంలో 12 గంటలు మాత్రమే చందనం పూత లేకుండా స్వామివారు దర్శనమిస్తారు. పవిత్రమైన అక్షయతృతీయ రోజున స్వామివారి విగ్రహానికి చందనం పూత తొలగించి తిరిగి పూస్తారు. చందన యాత్ర లేదా చందనోత్సవం పేరిట ప్రతి ఏటా వైశాఖమాసంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారి తరఫున టీటీడీ చైర్మన్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బొక్కసం ఇన్ ఛార్జ్ శ్రీ గురు రాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



