TTD CHAIRMAN PARTICIPATES IN HIMAYATNAGAR BTU _ హిమాయత్ నగర్ ఎస్వీ టెంపుల్ లో ఘనంగా గరుడ వాహనం సేవ
TIRUPATI, 05 JUNE 2025: TTD Chairman Sri BR Naidu took part in the Garuda vahana seva at Sri Venkateswara Swamy temple in Himayatnagar of Hyderabad on Thursday evening.
The event went off in a colourful manner with the devotional troupes displaying colourful artforms in front of Vahanam during the procession.
Temple staff, devotees, sevaks were also present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హిమాయత్ నగర్ ఎస్వీ టెంపుల్ లో ఘనంగా గరుడ వాహనం సేవ
గరుడ సేవలో టీటీడీ చైర్మన్
తిరుపతి/ హిమాయత్ నగర్, 2025 జూన్ 05: హైదరాబాద్ నగరం హిమాయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి భక్తజనం మధ్య అత్యంత వైభవంగా గరుడ వాహనం సేవ జరిగింది. వాహన సేవకు టిటిడి పాలక మండలి ఛైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు దంపతులు హాజరయ్యారు.
ముందుగా శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు, ఏఈఓ రమేష్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసారు.
స్వామి వారి దర్శనాంతరం చైర్మన్ దంపతులకు స్వామివారి పట్టు వస్త్రంతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం గరుడ వాహన సేవలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, స్వామివారి బ్రహ్మోత్సవాలకు తనకు ఆహ్వానం లభించడం, టిటిడి ఛైర్మన్ హోదాలో గరుడ సేవలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయానికి తనకు చాలా అనుబంధం ఉందని, బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన ఏర్పాట్లు కల్పిస్తామని ఛైర్మన్ మాట్లాడారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ కళాకారుల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
గరుడ వాహనం సేవలో టిటిడి అధికారులు, శ్రీవారి సేవకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.